చికెన్‌లో ఈ పార్ట్‌ అస్సలు  మిస్‌ అవ్వకండి.. 

Narender Vaitla

11 October 2024

చికెన్‌ లివర్‌ను తీసుకోవడం వల్ల గుండె జబ్బుల బారినపడకుండా ఉండొచ్చు. ఇందులోని సెలీనియం గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. 

క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక సమస్యల బారినపడకుండా ఉండడంలో చికెన్‌ లివర్‌ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి మేలు చేస్తాయి.

లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా చికెన్‌ లివర్‌ కీలకపాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫొలేట్‌ ముఖ్యంగా పురుషులకు ఎంతో మేలు చేస్తుంది.

చికెన్‌ లివర్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే మెదడు పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

కంటి ఆరోగ్యం మెరుగవ్వాలంటే లివర్‌ను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్‌ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది

పోషకాహర లోపంతో బాధపడేవాళ్లు కూడా చికెన్‌ లివర్‌ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని ఎన్నో పోషకాలు శరీరానికి కావాల్సిన మినరల్స్‌ను అందిస్తుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచాంరం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబందధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.