గ్రీన్ టీ తాగే అలవాటుందా..? ఈ విషయాలు తెలుసుకోండి..!
Jyothi Gadda
11 October 2024
గ్రీన్‌టీతో శరీరంలో మెటబోలిజంను వేగవంతం చేస్తుంది. ఫలితంగా కొవ్వు వేగంగా బర్న్ అవుతుంది. అయితే చాలామంది గ్రీన్ టీ విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. అవేంటంటే..
ముఖ్యంగా ఒకసారి వాడిన గ్రీన్ టీ బ్యాగ్‌ని రెండోసారి ఉపయోగించకూడదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ టీ బ్యాగ్ మాత్రమే ఉపయోగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
గ్రీన్ టీ కొన్ని మెడిసిన్స్‌తో రియాక్షన్ ఇస్తుంది. రక్తం పల్చగా చేసే మందులు, డిప్రెషన్, హై బీపీ మందులు ముఖ్యమైనవి. ఈ మందులు తీసుకునేవాళ్లు గ్రీన్ టీ తాగాలంటే వైద్యుని సంప్రదించాలి.
మరుగుతున్న నీళ్లలో గ్రీన్ టీ కలపడం వల్ల అందులోని పోషకాలు నష్టపోతాయి. దాంతో రుచి చేదుగా మారుతుంది. గ్రీన్ టీను 80-85 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దాటకుండా చూసుకోవాలి.
గ్రీన్ టీలో ఉండే కెఫీన్ కారణంగా నిద్రపోవడానికి కొద్దిసేపు ముందు తాగితే మొత్తం నిద్ర చెడిపోతుంది. అందుకే గ్రీన్ టీ తాగాలంటే ఎప్పుడూ నిద్రపోవడానికి 2-3 గంటల ముందు సేవించాలి
గ్రీన్ టీతో ప్రయోజనాలు చాలా ఉన్నాయి. కానీ మోతాదు మించి తాగకూడదు. పరిమితి దాటి తాగితే నిద్రలేమి, ఆందోళన, జీర్ణ సంబంధ సమస్యలు ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది.
గ్రీన్ టీలో ఉండే ట్యానిన్ కారణంగా కడుపులో ఎసిడిటీ పెరగవచ్చు. ఫలితంగా కడుపు సంబంధిత సమస్యలు దూరమౌతాయి. జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి.
రోజూకు 2-3 కప్పుల గ్రీన్ టీ వరకు తాగవచ్చు. అంతకు మించకూడదు. 2 తాగితే మరీ మంచిది. ముఖ్యంగా గ్రీన్ టీ తాగేముందు నిపుణుల సూచనలు తీసుకోవటం తప్పనిసరి.