పిత్తాశయంతో రాళ్లు పోవాలంటే కచ్చితంగా శస్త్ర చికత్స చేయాల్సిందే. అయితే కొన్ని రకాల జీవన శైలి మార్పులతో ఈ సమస్య నుంచి నేచురల్‌గా బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
పితాశయంలో రాళ్లతో బాధపడుతున్న వ్యక్తి స్పైసీ ఫుడ్ తినకూడదు. ఎక్కువ కారం, మసాలాలు ఉండే వాటికి దూరంగా ఉండాలి. దీంతో సమస్య తగ్గుతుంది.
కొన్ని రకాల యోగాసనాలు చేయడం వల్ల కూడా పిత్తాశయంలో రాళ్ల సమస్య తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. రోజూ యోగాను కచ్చితంగా అలవాటు చేసుకోవాలి.
ఇక వాకింగ్ చేయడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతీరోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి.
ఒత్తిడిని తగ్గించుకోవడం, సరైన నిద్రతో కూడా పిత్తాశయంలో రాళ్ల సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి తగ్గించుకునేందుకు మెడిటేషన్ చేయాలి.
యాపిల్ వెనిగర్ పిత్తాశయంలో రాళ్లను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. రోజూ ఒకటి నుండి రెండు స్పూన్లు వెనిగర్ తీసుకుంటే బర్నింగ్ సెన్సేషన్, నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
పిత్తాశయంలో రాళ్ల సమస్యతో బాధపడే వారు ఎక్కువగా నీరు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కచ్చితంగా 8 నుంచి 10 గ్లాసుల నీటిని తీసుకోవాలని అంటున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.