Ratan Tata: నాన్నే స్ఫూర్తి.. రతన్ టాటా తండ్రి ప్రస్థాన మిది..

. వారిలో ప్రస్తుత కాలానికి సుపరిచితుడైన రతన్ టాటా  అనారోగ్యంతో ముంబైలో కన్నుమూశారు. ప్రజల అభిమానాన్ని పొందిన పారిశ్రామికవేత్తగా ఆయన ఖ్యాతి పొందారు. అలాగే రతన్ తండ్రి నావల్ టాటా కూడా టాటా గ్రూప్ ఉన్నతికి ఎంతో పాటుపడ్డారు. సమాజ సేవలోనూ తనదైన ముద్ర వేశారు. అయితే టాటా కుటుంబానికి నావల్ దత్త పుత్రుడు. ఆయన టాటా గ్రూపును మరో మెట్టు పైకి ఎక్కించారు.

Ratan Tata: నాన్నే స్ఫూర్తి.. రతన్ టాటా తండ్రి ప్రస్థాన మిది..
Ratan Tata
Follow us

|

Updated on: Oct 12, 2024 | 8:54 AM

దేశంలో పారిశ్రామిక ప్రగతికి టాటా గ్రూప్ చేసిన సేవలు మరువలేనివి. పరిశ్రమలను స్థాపించి అనేక మందికి ఉపాధి కల్పించడంతో పాటు సాంకేతికతను మన దేశానికి తీసుకువచ్చింది. లాభాల కోసమే కాకుండా ప్రజల బాగోగులు కోసం ఆలోచించింది. ఈ సంస్థ చైర్మన్లుగా చాలా మంది బాధ్యతలు చేపట్టి, ప్రగతి పథంలో నడిపించారు. వారిలో ప్రస్తుత కాలానికి సుపరిచితుడైన రతన్ టాటా  అనారోగ్యంతో ముంబైలో కన్నుమూశారు. ప్రజల అభిమానాన్ని పొందిన పారిశ్రామికవేత్తగా ఆయన ఖ్యాతి పొందారు. అలాగే రతన్ తండ్రి నావల్ టాటా కూడా టాటా గ్రూప్ ఉన్నతికి ఎంతో పాటుపడ్డారు. సమాజ సేవలోనూ తనదైన ముద్ర వేశారు. అయితే టాటా కుటుంబానికి నావల్ దత్త పుత్రుడు. ఆయన టాటా గ్రూపును మరో మెట్టు పైకి ఎక్కించారు.

నావల్ టాటా..

రతన్ టాటా తండ్రి నావల్ 1904 ఆగస్టు 30వ తేదీన జన్మించారు. ఆయన తండ్రి అహ్మదాబాద్ లోని అడ్వాన్స్ మిల్లులో స్పిన్నింగ్ మాస్టర్ గా పనిచేసేవారు. నావల్ కు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన మరణించారు. దీంతో నావల్ ను తీసుకుని తల్లి గుజరాత్ లోని నవ్ సారికి బతుకుతెరువు కోసం వెళ్లారు. అక్కడ ఆమె ఎంబ్రాయిడరీ పనిచేసేవారు. దీంతో నావల్ ను జేఎన్ పెటిట్ పార్సీ అనాథ ఆశ్రయంలో చేర్చారు. అక్కడే ఆయన చదువుకునేవాడు. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ నకు చెందిన రతన్ జీ జంసెట్ జీ టాటా, ఆయన భార్య నవాజ్ బాయి ఆశ్రమానికి వచ్చారు. అక్కడ నావల్ ను చూసి ముచ్చటపడి దత్తత తీసుకున్నారు. అలాగ నావల్ తన 13 ఏళ్ల వయసులో టాటా కుటుంబానికి దత్త పుత్రుడయ్యారు.

ఉన్నత విద్య..

టాటా కుటుంబంలోకి వచ్చిన తర్వాత నావల్ చదువు బాగా సాగింది. బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. అనంతరం లండన్ లో అకౌంటింగ్ కు సంబంధించిన కోర్సును పూర్తి చేశారు. చిన్నతనంలో నుంచి పేదరికంలో గడిపిన నావల్ కు ఆత్మవిశ్వాసం ఎక్కువ. ప్రతి పనినీ పట్టుదల పూర్తి చేసేవారు. ఆయన రెండు వివాహాలు చేసుకున్నారు. మొదటి భార్య సూని కమసరియట్ కు రతన్ టాటా, జిమ్మీ టాటా జన్మించారు. భేదాభిప్రాయాలు వచ్చి సూనితో విడిపోయిన తర్వాత సిమోన్ ను పెళ్లి చేసుకున్నారు. వీరికి నోయోల్ టాటా జన్మించారు.

ఒక్కో మెట్టు ఎక్కుతూ..

నావల్ 1930లో టాటా సన్స్ లో చేరారు. అక్కడ క్లర్క్ కమ్ అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేశారు. 1933లో విమానయాన శాఖ కార్యదర్శిగా పదోన్నతి లభించింది. ఆ తర్వాత టాటా మిల్స్, ఇతర యూనిట్లతో అనుబంధం ఏర్పడింది. అనంతరం 1941లో టాటా సన్స్ డైరెక్టర్ గా, 1961లో టాటా పవర్ చైర్ పర్సన్ గా పనిచేశారు. ఏడాది తర్వాత టాటా సన్స్ డిప్యూటీ చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ నావల్ టాటా ఎంతో చురుకుగా ఉండేవారు. సర్ రతన్ టాటా ట్రస్ట్ చైర్ పర్సన్ గా కూడా పనిచేశారు. ఇండియన్ హామీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా, అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ వైస్ చైర్ పర్సన్ గా సేవలందించారు. రాజకీయాలకు సంబంధించి 1971 ఎన్నికలలో సౌత్ బాంబే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. నావల్ టాటాకు 1969లో పద్మ భూషణ్ అవార్డు లభించింది. ఆయన క్యాన్సర్ తో బాధపడుతూ 1989 మే 5న ముంబైలో కన్నుమూశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నాన్నే స్ఫూర్తి.. రతన్ టాటా తండ్రి ప్రస్థాన మిది..
నాన్నే స్ఫూర్తి.. రతన్ టాటా తండ్రి ప్రస్థాన మిది..
నేను చెప్పిందే ఫైనల్‌.. మూసీ స్టాండ్‌పై కిషన్‌ రెడ్డి క్లారిటీ..
నేను చెప్పిందే ఫైనల్‌.. మూసీ స్టాండ్‌పై కిషన్‌ రెడ్డి క్లారిటీ..
మరో 2 రోజుల్లో TGPSC గ్రూప్‌ 1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు విడుదల
మరో 2 రోజుల్లో TGPSC గ్రూప్‌ 1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు విడుదల
రైల్వేలో ఉన్నత ఉద్యోగమే మీ లక్ష్యమా.. ఇదే మంచి అవకాశం
రైల్వేలో ఉన్నత ఉద్యోగమే మీ లక్ష్యమా.. ఇదే మంచి అవకాశం
బ్రహ్మోత్సవాలు నేటితో ముగింపు.. శాస్రోక్తంగా సాగుతున్న చక్రస్నానం
బ్రహ్మోత్సవాలు నేటితో ముగింపు.. శాస్రోక్తంగా సాగుతున్న చక్రస్నానం
ఇత్తడి విగ్రహాలను, వస్తువులను ఇలా క్లీన్ చేస్తే మెరిసి పోతాయి..
ఇత్తడి విగ్రహాలను, వస్తువులను ఇలా క్లీన్ చేస్తే మెరిసి పోతాయి..
రూ.లక్షకు 14వేలు.. అందరూ ప్రభుత్వ ఉద్యోగులే..!
రూ.లక్షకు 14వేలు.. అందరూ ప్రభుత్వ ఉద్యోగులే..!
విస్కీ, బీర్‌ రెండూ కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా.?
విస్కీ, బీర్‌ రెండూ కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా.?
నేడే దేవరగట్టు కర్రల సమరం.. పకడ్బందీ ఏర్పాట్లు .. భారీ బందోబస్త్
నేడే దేవరగట్టు కర్రల సమరం.. పకడ్బందీ ఏర్పాట్లు .. భారీ బందోబస్త్
‘బాస్’.. మరికొన్ని గంటలే మిగిలింది.. అవకాశం వదలొద్దు.. 
‘బాస్’.. మరికొన్ని గంటలే మిగిలింది.. అవకాశం వదలొద్దు..