10 October 2024
Subhash
రతన్ టాటా ఈ రోజు మన మధ్య లేకపోయినా కోట్లాది మంది గుండెల్లో సజీవంగానే ఉంటారు. రతన్ టాటాకు కొన్ని కలలు ఉన్నాయి.
వాస్తవానికి రతన్ టాటాకు మూడు కలలు ఉన్నాయి. అవి ఎప్పటికి నెరవేరలేవు. ఈ మూడు కలలు అడియాశలుగానే మిగిలిపోయాయి.
ప్రేమ వివాహం చేసుకోవాలని రతన్ టాటా మొదటి కల. కానీ నాలుగు సార్లు ప్రేమలో పడ్డారు. విషయం పెళ్లి వరకు వెళ్లింది. అయినప్పటికీ చివరకు అది నెరవేరకుండా పోయింది.
రతన్ టాటా పెళ్లి చేసుకోబోయే అమ్మాయిది అమెరికా. ఇండియాకు రావాలని కోరగా, యుద్ధం కారణంగా రాకపోవడంతో ఆమె పెళ్లి చేసుకోలేకపోయింది.
భారతదేశంలోని సామన్యుడికి లక్షకు కార కొనాలనే కల ఉంది. దానిని నెరవేర్చడానికి టాటా నానో కారును 2008లో తీసుకువచ్చినా అది పూర్తి స్థాయిలో నెరవేరలేదు.
సామాన్యులకు లక్షల రూపాయలకే కారును తీసుకురావాలన్న ఉద్దేశంతో నానో కారును తీసుకువచ్చినా అది పూర్తి పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.
టాటా ప్రోడక్షన్ హౌస్‌లో సినిమాలు తీయాలన్నది రతన్ టాటా కల. కానీ సినిమాలు తీయాలన్నది కూడా నెరవేరలేదు.
రతన్ టాటా ఈ మూడు కలలో నెరవేరకపోయినా.. ఎన్నో కంపెనీలను స్థాపించి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి ఇంట్లో టాటా ఉత్పత్తులో ఎన్నో ఉన్నాయి.