మీ పీఎఫ్‌ విత్‌డ్రా రిజెక్ట్‌ అయ్యిందా..? కారణాలు ఇవే.. ఇలా చేయండి

08 October 2024

Subhash

ఉద్యోగులకు ఎప్పుడైనా ఈపీఎఫ్‌లో కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ కొన్ని సార్లు ఈ క్లయిమ్స్‌ రిజెక్టు అవుతాయి.

ఈపీఎఫ్‌

ఇలా ఎందుకు జరుగుతుందనే కారణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని సార్లు ఈ క్లయిమ్స్‌ రిజెక్టు అవుతాయి. మరి అందుకు కారణాలు ఏంటో తెలుసుకుందాం.

కారణాలు

మీ పీఎఫ్‌ అకౌంట్‌లో మొబైల్‌ నంబర్‌, చిరునామా అప్‌డేట్‌ అయ్యిందో లేదో ఓ సారి చెక్‌ చేయండి. మీ పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు సరిపోలుతున్నాయా ? లేదా తెలుసుకోండి.

పీఎఫ్‌

అలాగే మీ బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌, IFSC కోడ్‌, బ్యాంకు బ్రాంచ్‌ పేరు వంటి వివరాలను ఒకటికి రెండు సార్లు తనిఖీ చేయడం ముఖ్యం. 

బ్యాంక్‌ అకౌంట్‌

క్లెయిమ్‌ ఫాం, గుర్తింపు డాక్యుమెంట్లు, అడ్రస్‌, బ్యాంకు అకౌంట్‌ వివరాల పత్రాలు సమర్పించండి. క్లెయిమ్‌ కోసం అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారనే విషయాన్ని నిర్ధారించుకోండి.

క్లెయిమ్‌

కంపెనీ సంబంధిత సమస్యలతో కొన్ని సందర్భాలలో క్లెయిమ్‌ తిరస్కరించే అవకాశాలు కూడా ఉంటాయని గుర్తించుకోండి.

క్లెయిమ్‌ 

సంస్థ నుంచి రిలీవ్‌ అయిన తేదీ కంపెనీ అప్‌డేట్‌ చేయకపోవడం వంటి సమస్యలు కూడా క్లెయిమ్‌ రిజెక్టుకు కారణం కావచ్చు.

రిలీవ్‌

మీ కంపెనీ సహకరించకుంటే లేబర్‌ కమిషనర్‌ కార్యాలయాన్ని ఆశ్రయించవచ్చు. ఈ క్రమంలో ఈపీఎఫ్‌ఓ గ్రీవెన్స్‌ పోర్టల్‌ ద్వారా మీరు ఫిర్యాదు చేయవచ్చు.

కంపెనీ