06 October 2024
Subhash
కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లను ప్రకటించే దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో.
ఇటీవల రూ.1029 ప్లాన్‌ను సవరించింది. పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిప్షన్లను అందిస్తున్న కంపెనీ.. అప్‌డేట్‌లో భాగంగా కొత్తగా అమెజాన్ ప్రైమ్ లైట్‌ను చేర్చింది.
ఈ జియో రీఛార్జ్ ప్లాన్‌లో అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ సేవలను కూడా వినియోగదారులు ఆస్వాదించవచ్చు.
ఈ జియో రీఛార్జ్ ప్లాన్‌లో అమెజాన్ ప్రైమ్ లైట్‌లో కస్టమర్లు రెండు డివైజ్‌లలో (టీవీ లేదా మొబైల్) స్ట్రీమింగ్‌ను వీక్షించవచ్చు.
కాగా, ఇప్పటికే అందిస్తున్న ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌లో ఒక మొబైల్ డివైజ్‌కు మాత్రమే అవకాశం ఉంటుంది.
కాగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌ను కోరుకునేవారికి రూ.1029 ప్లాన్ చక్కటి ఆఫర్. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.
ఇందులో అపరిమిత ఉచిత కాలింగ్, ప్రతి రోజు 100 ఉచిత మెసేజ్‌లు, ప్రతి రోజు 2 జీబీల హైస్పీడ్ డేటాను పొందవచ్చు.
అంతేకాదు కస్టమర్ ఉన్న ప్రాంతంలో 5జీ కనెక్టివిటీ ఉంటే అపరిమిత 5జీ డేటాను కూడా ఉపయోగించుకోవచ్చు.