రతన్‌ టాటా స్పూర్తిదాయకమైన మాటలు.. ఒక్కసారైనా వినాల్సిందే

10 October 2024

TV9 Telugu

TV9 Telugu

బిజినెస్‌ టైకూన్‌ రతన్ టాటా అనారోగ్యంతో పోరాడుతూ 85 యేళ్ల వయసులో కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ అక్టోబర్ 9 బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు

TV9 Telugu

ఆయన మరణం యావత్‌ దేశాన్ని తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. ఆయన భౌతికంగా మన మధ్యలేనప్పటికీ.. పలు సందర్భాల్లో ఆయన చెప్పిన మాటలు, విలువైన సూక్తులు, ఎంతో స్ఫూర్తినిస్తాయి

TV9 Telugu

తన అచంచల నైపుణ్యాలు, పట్టుదలతో రతన్ టాటా టాటా గ్రూప్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. రతన్‌ టాటా మంచి బిజినెస్‌ మ్యాన్ మాత్రమేకాదు ఉన్నత వ్యక్తిత్వానికి కూడా పేరు పొందారు

TV9 Telugu

జీవితంలో ముందుకు సాగాలంటే ఎత్తుపల్లాలు చాలా ముఖ్యమని రతన్ టాటా చెబుతుంటారు. జీవితం సరళ రేఖ మాదిరి ఉంటే మనం బతకలేమని అంటారు. ఎందుకంటే ECGలో సరళరేఖ కూడా మనం జీవించి లేమని చెబుతుంది

TV9 Telugu

ఎవరైనా మీపై రాళ్లు విసిరితే, ఆ రాళ్లను మీ రాజభవనాన్ని నిర్మించుకోమని వాడుకోవాలని చెబుతారు. మీరు వేగంగా వెళ్లాలనుకుంటే, ఒంటరిగా వెళ్లండి. కానీ మీరు చాలా దూరం వెళ్లాలనుకుంటే మాత్రం, కలిసి వెళ్లండి

TV9 Telugu

సరైన నిర్ణయాలు తీసుకోవడంపై నాకు నమ్మకం లేదని రతన్ టాటా అంటారు. కానీ నేను నిర్ణయాలు తీసుకుంటాను.. అవి సరైనవని రుజువు చేస్తాను. ఎలాంటి రిస్క్ తీసుకోకపోవడమే గొప్ప రిస్క్. వేగంగా మారుతున్న ప్రపంచంలో, విఫలమవుతుందని హామీ ఇచ్చే ఏకైక వ్యూహం రిస్క్ తీసుకోకపోవడం

TV9 Telugu

విజయాన్ని మీ స్థానం బట్టి కాదు, ఇతరులపై మీ ప్రభావంతో కొలుస్తారు. విజయం మీ తలకి ఎక్కనివ్వవద్దు. అలాగే వైఫల్యాన్ని మీ హృదయంలోకి వెళ్లనివ్వవద్దు. పెద్దగా కలలు కనండి.. ఆ కలలను సాకారం చేసుకోవడానికి కష్టపడండి. మీ ఔన్నత్యాన్ని నిర్ణయించేది మీ వైఖరి, మీ సామర్థ్యం కాదు

TV9 Telugu

అవకాశాల కోసం ఎదురు చూడకండి. మీరే స్వంత అవకాశాలను సృష్టించండి. నేర్చుకోవడం ఎప్పుడూ ఆపవద్దు. ఎదగడానికి, అభివృద్ధి చేయడానికి మిమ్మల్ని మీరు సవాలు చేసుకోండి.. ఇలా ఎన్నో విలువైన మాటలు ఆయన మన కోసం వదిలి వెళ్లారు