Asthma Patients Care: మీకు ఆస్తమా సమస్య ఉందా.. చలికాలం వచ్చేసింది జాగ్రత్త!

|

Oct 28, 2024 | 6:04 PM

చలి కాలం వచ్చేసింది. వింటర్ అంటే చాలా మందికి ఇష్టం. ఉదయాన్నే మంచు పడుతూ ఉంటే ప్రకృతి ఎంతో అందంగా కనిపిస్తుంది. ఆ అందాన్ని పదాల్లో కూడా వర్ణించలేం. ఎక్కడ చూసినా పచ్చదనం.. మంచు మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ వింటర్‌ సీజన్‌లో పువ్వులు కూడా ఎక్కువగా పూస్తూ ఉంటాయి. అందులోనూ గ్రామాల్లో ఉండే అందమే వేరు. కానీ ఈ సమయంలో ఆస్తమా ఉన్న వారు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వింటర్ సీజన్‌లో మొదటగా వచ్చే పండుగల్లో దీపావళి కూడా ఒకటి. దీపావళి కోసం ఎంతో మంది..

Asthma Patients Care: మీకు ఆస్తమా సమస్య ఉందా.. చలికాలం వచ్చేసింది జాగ్రత్త!
Asthma
Follow us on

చలి కాలం వచ్చేసింది. వింటర్ అంటే చాలా మందికి ఇష్టం. ఉదయాన్నే మంచు పడుతూ ఉంటే ప్రకృతి ఎంతో అందంగా కనిపిస్తుంది. ఆ అందాన్ని పదాల్లో కూడా వర్ణించలేం. ఎక్కడ చూసినా పచ్చదనం.. మంచు మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ వింటర్‌ సీజన్‌లో పువ్వులు కూడా ఎక్కువగా పూస్తూ ఉంటాయి. అందులోనూ గ్రామాల్లో ఉండే అందమే వేరు. కానీ ఈ సమయంలో ఆస్తమా ఉన్న వారు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వింటర్ సీజన్‌లో మొదటగా వచ్చే పండుగల్లో దీపావళి కూడా ఒకటి. దీపావళి కోసం ఎంతో మంది ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. బాణా సంచా కాల్చుతూ ఎంతో ఆనందిస్తారు. కానీ ఈ సమయంలో ఆస్తమా పేషెంట్లు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిందే. ఈ సమయంలో మంచు కారణంగా ఆస్తమా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఆస్తమా లక్షణాలు ఏంటి? ఆస్తమా ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఆస్తమా దగ్గు:

నిరంతరంగా దగ్గు వస్తుంది, ఛాతీలో బిగుతుగా, ఒత్తిడి పడుతున్నట్టు ఉండటం, ఊసిరి తీసుకోవడంలో కూడా ఇబ్బందులు, ఎక్కువగా ఆయాసంగా ఉండటం, శ్వాస తీసుకునేటప్పుడు గర్ర్.. గర్ర్.. అంటూ శబ్దాలు రావడం, అలసట, నీరసం, నిద్రలేమి సమస్యలు, కఫం ఎక్కువగా పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

బాణా సంచాకు దూరంగా ఉండండి:

ఆస్తమా ఉన్నవారు బాణా సంచాకు దూరంగా ఉండాలి. టపాకాయలు కాల్చేటప్పుడు వచ్చే పొగను వీరు పీల్చడం వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి దీపావళి సమయంలో గది తలుపులు వేసుకుని వీరు లోపల ఉండటం మంచిది.

ఇవి కూడా చదవండి

మాస్క్ ధరించాలి:

చలి కాలంలో ఆస్తమా ఉన్నవారు ఖచ్చితంగా మాస్క్ ధరించాలి. దీని వల్ల అలర్జీ సమస్యలు, పొంగ మంచు నుంచి మీకు రక్షణగా ఉంటుంది. మంచు సమయంలో బయటకు వెళ్లేటప్పుడు తలపై క్యాప్ పెట్టుకోవడం బెటర్.

వాటర్ ఎక్కువగా తీసుకోవాలి:

ఆస్తమా సమస్యలతో బాధ పడేవారు ఖచ్చితంగా గోరు వెచ్చని నీటిని తాగాలి. నీరు తాగడం వల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. ఆస్తమాతో బాధ పడేవారు వింటర్‌ సీజన్‌లో పొగ తాగడం, మద్యం తాగడం మానుకోవాలి.

హెల్దీ ఫుడ్స్:

ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలి. నూనె, స్పైసీగా ఉండే ఆహారాలు తినడం మానుకోవాలి. దీని వల్ల ఆస్తమా సమస్యను కంట్రోల్ చేయవచ్చు. హెల్దీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.