Kitchen Hacks: ప్రెజర్ కుక్కర్ నుంచి వాటర్ లీక్ అవుతున్నాయా.. ఇలా చేయండి..

|

Oct 18, 2024 | 4:45 PM

కుక్కర్స్ వచ్చాక వంట అనేది మహిళలకు చాలా ఈజీగా అయిపోయింది. జస్ట్ మూత పెట్టి విజిల్ పెట్టి.. ఆ విజిల్స్ లెక్క పెడితే చాలు. వంట సిద్ధం. పప్పు అయినా.. అసలు ఉడకని మటన్ అయినా చాలా త్వరగా ఉడికిపోతాయి. అదే విధంగా రుచి కూడా ఉంటాయి. ప్రెజర్ కుక్కర్‌తో మహిళల పని కూడా సులువు అయిపోయింది. ఎలాంటి వారి ఇంట్లో అయినా కామన్‌‌గా ఉండే వస్తువుల్లో కుక్కర్ కూడా ఒకటి. అయితే ఈ కుక్కర్లు వాడే కొద్దీ..

Kitchen Hacks: ప్రెజర్ కుక్కర్ నుంచి వాటర్ లీక్ అవుతున్నాయా.. ఇలా చేయండి..
Kitchen Hacks
Follow us on

కుక్కర్స్ వచ్చాక వంట అనేది మహిళలకు చాలా ఈజీగా అయిపోయింది. జస్ట్ మూత పెట్టి విజిల్ పెట్టి.. ఆ విజిల్స్ లెక్క పెడితే చాలు. వంట సిద్ధం. పప్పు అయినా.. అసలు ఉడకని మటన్ అయినా చాలా త్వరగా ఉడికిపోతాయి. అదే విధంగా రుచి కూడా ఉంటాయి. ప్రెజర్ కుక్కర్‌తో మహిళల పని కూడా సులువు అయిపోయింది. ఎలాంటి వారి ఇంట్లో అయినా కామన్‌‌గా ఉండే వస్తువుల్లో కుక్కర్ కూడా ఒకటి. అయితే ఈ కుక్కర్లు వాడే కొద్దీ.. పై మూత నుంచి వాటర్ లీక్ అవుతూ ఉంటాయి. అదే విధంగా వాటర్ ఎక్కువగా వేసినా కూడా నీరు బయటకు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు చాలా విసుగ్గా ఉంటుంది. ఆ వాటర్ లీక్ వలన గ్యాస్ పొయ్యి పాడవుతుంది. ఒక్కోసారి లోపలు ఉండే పదార్థాలు కూడా మాడిపోతాయి. కాబట్టి కుక్కర్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఇలా కుక్కర్ నుంచి నీరు లీక్ అవుతూ ఉంటే.. ఈ సారి ఇలా చేయండి.

వెనిగర్:

కుక్కర్‌లో నుంచి నీరు బయటకు రావడానికి వెనిగర్‌కు ఏంటి సంబంధం అనుకుంటున్నారా.. ఉంది. నీరు బయటకు పోకుండా ఈ ట్రిక్ కూడా పని చేస్తుంది. కుక్కర్ మూతకు ఉండే రబ్బరుని వెనిగర్ కలిపిన నీటిలో ఉంచండి. ఇలా ఓ అరగంట పాటు పెట్టిన తర్వాత కుక్కర్‌కి పెట్టి వండండి. కుక్కర్ మళ్లీ కొత్త దానిలా పని చేస్తుంది.

తడి క్లాత్ ఉంచండి:

కుక్కర్ మూత నుంచి నీరు కారుతూ ఉంటే.. గ్యాస్ స్టవ్ మాత్రమే కాకుండా.. చుట్టుపక్కల ఉండే గిన్నెలు కూడా పాడవుతాయి. అలా కాకుండా ఉండాలంటే.. కుక్కర్ మూత చుట్టూ తడి క్లాత్ ఉంచండి. ఇది సీల్‌గా పని చేసి.. లీకేజీని తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

రబ్బరుకు ఆయిల్ రాయండి:

కుక్కర్ సరిగా పని చేయాలంటే.. రబ్బరు ప్రధానం. రబ్బరు సరిగ్గా పెట్టకపోతే కొన్ని సార్లు కుక్కర్లు పేలిన ఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి కుక్కర్ మూత సరిగా పట్టాలి. రబ్బరుకు కొద్దిగా ఆయిల్ రాసి.. ఓ ఐదు నిమిషాలు పక్కన పెట్టండి. ఆ తర్వాత వంట చేసుకోండి. ఇది వాటర్ బయటకు రాకుండా ఆపుతుంది. లీకేజీ అవకాశం కూడా తగ్గుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..