Low BP Precautions: ఉన్నట్టుండి బీపీ పడిపోయిందా.. వెంటనే ఇలా చేయండి..

|

Oct 19, 2024 | 12:55 PM

ఉన్నట్టుండి ఒక్కోసారి బీపీ పడిపోతుంది. కళ్లు తిరుగుతున్నట్టు.. వికారంగా ఉండటం జరుగుతుంది. ఒక్కోసారి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతారు. మరి కొందరిలో ఇది తరచుగా కనిపిస్తుంది. ఇంకొందరిలో అప్పుడప్పుడు కనిపిస్తుంది. ఇలా బీపీ తగ్గి పడిపోయినప్పుడు ఏం చేయాలో చాలా మందికి తెలీదు. ఇలా ఒక్కసారిగా రక్త పోటు తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. రక్త పోటు అనేది ఒక్కసారిగా తగ్గినా.. పెరిగినా కూడా ఆరోగ్యానికి ప్రమాదమే. ఈ మధ్య కాలంలో చాలా మందిలో..

Low BP Precautions: ఉన్నట్టుండి బీపీ పడిపోయిందా.. వెంటనే ఇలా చేయండి..
Low Bp
Follow us on

ఉన్నట్టుండి ఒక్కోసారి బీపీ పడిపోతుంది. కళ్లు తిరుగుతున్నట్టు.. వికారంగా ఉండటం జరుగుతుంది. ఒక్కోసారి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతారు. మరి కొందరిలో ఇది తరచుగా కనిపిస్తుంది. ఇంకొందరిలో అప్పుడప్పుడు కనిపిస్తుంది. ఇలా బీపీ తగ్గి పడిపోయినప్పుడు ఏం చేయాలో చాలా మందికి తెలీదు. ఇలా ఒక్కసారిగా రక్త పోటు తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. రక్త పోటు అనేది ఒక్కసారిగా తగ్గినా.. పెరిగినా కూడా ఆరోగ్యానికి ప్రమాదమే. ఈ మధ్య కాలంలో చాలా మందిలో లో బీపీ వస్తుంది. యువతలో ఎక్కువగా ఈ లోబీపీ కనిపిస్తుంది. సరిగా తినని కారణంగానే ఈ లో బీపీ వస్తుంది అనుకుంటే పొరపాటే. దీనిని హైపోటెన్షన్ అంటారు. వంశపారంపర్యంగా కూడా ఈ లో బీపీ వస్తుంది. అలాగే రక్త ప్రసరణ సరిగా లేకపోయినా, నిద్ర లేకపోయినా ఈ లో బీపీ ఎటాక్ చేస్తుంది.

ఈ లో బీపీని చాలా మంది తేలికగా తీసుకుంటారు. ఒక్కోసారి ఎవరూ లేని సమయంలో ఇబ్బందే. చాలా మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతారు. గుండె పోటుకు కూడా దారి తీయవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్త అవసరం. సాధారణంగా రక్త పోటు 120/80 ఉంటుంది. ఇంతకంటే తక్కువగా ఉంటే లో బీపీ కిందకు వస్తుంది. కాబట్టి వెంటనే చికిత్స తీసుకోవాలి. మరి బీపీ తగ్గినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పడుకోబెట్టండి:

అకస్మాత్తుగా బీపీ తగ్గినప్పుడు ఎక్కడైనా చల్లని ప్రదేశంలో కూర్చోబెట్టాలి. వీలుంటే పడుకోబెట్టండి. నీళ్లు కానీ జ్యూస్ కానీ తాగించాలి. రక్త ప్రసరణ జరిగేలా చేయాలి.

ఇవి కూడా చదవండి

ఉప్పు ఉన్న ఆహారాలు పెట్టండి:

లోబీపీతో ఉన్న వ్యక్తికి ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు ఇవ్వాలి. సాల్ట్, పంచదార కలిపిన నీరు, కాఫీ లేదా టీ వంటివి ఇవ్వాలి. స్నాక్స్ వంటివి కూడా పెట్టవచ్చు. ఇవి రక్త పోటును పెంచుతాయి. కాబట్టి సదరు వ్యక్తి త్వరగా కోలుకుంటారు.

మందుల ప్రభావం:

మందుల ప్రభావం కారణంగా కూడా లో బీపీ సమస్య ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో వైద్యులను సంప్రదించడం చాలా అవసరం. ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిదో తెలుసుకోవాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..