Astro Tips: ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే భారీ మూల్యం తప్పదు.. శాస్త్రం ఏ చెబుతోందంటే

సనాతన సంప్రదాయం ప్రకారం.. జీవితంలో విజయం సాధించాలంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలని నిపుణులు చెబుతున్నారు. ఆలస్యంగా నిద్రలేచే వారికి లక్ష్మీదేవీ అనుగ్రహం ఉండదు. జీవితంలో అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఉదయం లేచిన తర్వాత కొందరు మళ్లీ పడుకుంటారు అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని...

Astro Tips: ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే భారీ మూల్యం తప్పదు.. శాస్త్రం ఏ చెబుతోందంటే
Morning Wakeup
Follow us

|

Updated on: Jun 16, 2024 | 10:28 AM

భారతదేశం సనాతన ధర్మానికి పెట్టింది పేరు. మనిషి జీవితంలో ఎదగడానికి, ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ఎలాంటి విషయాలు పాటించాలనే విషయాలను శాస్త్రంలో సవివరంగా తెలిపారు. ఇలాంటి వాటిలో ఉదయం నిద్రలేవగానే చేయకూడని ఉన్న తప్పుల గురించి శాస్త్రంలో వివరించారు. జీవితంలో విజయం సాధించాలంటే ఉదయం పూట చేయకూడని కొన్ని ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సనాతన సంప్రదాయం ప్రకారం.. జీవితంలో విజయం సాధించాలంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలని నిపుణులు చెబుతున్నారు. ఆలస్యంగా నిద్రలేచే వారికి లక్ష్మీదేవీ అనుగ్రహం ఉండదు. జీవితంలో అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఉదయం లేచిన తర్వాత కొందరు మళ్లీ పడుకుంటారు అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ఉదయం లేవగానే చేయకూడని పనుల్లో అద్దంలో ముఖం చూసుకోవడం ఒకటి. మీకు అదే అలవాటు ఉంటే, మీ అలవాటును వెంటనే మార్చుకోండి. ఇది అస్సలు మంచిది కాదని పండితులు చెబుతున్నారు.

ఉదయం లేవగానే మీ స్వంత నీడను కూడా చూడడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అలాగే కుక్కలు పోట్లాడడం వంటి చూడకూడదని పండితులు చెబుతున్నారు. ఉదయం నిద్రలేవగానే వంట గదిలో మురికి పాత్రలను చూడడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీలైనంత వరకు రాత్రి తిన్న తర్వాతే పాత్రలను శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. ఉదయం స్నానం చేసిన తర్వాతే వంట గదిలోకి వెళ్లాలి.

ఇక ఉదయం మనం నిద్ర లేచిన తర్వాత మన రోజు ఎలా ప్రారంభమవుతుందో దానిపైనే మన రోజంతా ఆధారపడి ఉంటుంది. అందుకే ఉదయం లేవగానే ఎవరితో గొడవపడకూడదు, సంతోషంగా రోజును ప్రారంభిస్తే రోజంతా సంతోషంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సానుకూల దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలి.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Latest Articles