నేరేడు పండ్లు తిన్న వెంటనే వీటిని పొరపాటున వీటిని తినొద్దు.. 

25 June 2024

TV9 Telugu

Pic credit - pexels

నేరేడు పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఓ వరం. నేరేడు పండ్లు, ఆకులు తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఆరోగ్యానికి మేలు 

నేరేడు పండులో  కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువు తగ్గడంలో మంచి సహాయకారి. 

జీర్ణవ్యవస్థ

వీటిల్లో యాంటీఆక్సిడెంట్లు సహా విటమిన్ సి, బి, థయామిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం, కొవ్వు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్ పుష్కలంగా ఉన్నాయి. 

పోషకాలు మెండు 

ఈ పండ్లను తినే విషయంలో కొన్ని పద్ధతులున్నాయి. నేరేడు పండ్లు తింటూ కొన్ని ఆహారాలు తినకూడదు. ఇలా తినడం వలన ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. దుష్ప్రభావాలకు కూడా దారితీయవచ్చు.

తినడానికి నియమాలు 

ఆయుర్వేదం ప్రకారం నేరేడు పండ్లు తిన్న తర్వాత పాలు తాగవద్దు. ఇలా చేస్తే జీర్ణక్రియ సంబంధిత సమస్యలు వస్తాయి. కడుపు నొప్పి, గ్యాస్, మలబద్ధకం వంటి ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది.

పాలు తాగొద్దు 

నేరేడు పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగరాదు. ఇలా నీరు తాగితే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని.. డయేరియా, అజీర్ణం వంటి వాటితో ఇబ్బంది పడవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. 

నీరు తాగవద్దు 

నేరేడు పండ్లు పుల్లగా ఉంటాయి. కనుక ఖాళీ కడుపుతో తింటే ఎసిడిటీ, కడుపు నొప్పి, చికాకు వంచి సమస్యల బారిన పడే అవకాశం ఉంది. 

ఖాళీ కడుపుతో 

ఊరగాయలో నూనె, ఆవ, మెంతి వంటి మసాలాలు ఎక్కువగా ఉంటాయి. కనుక నేరేడు పండ్లు తిన్న తర్వాత ఊరగాయలను తినొద్దు. విరేచనాలు, అజీర్ణం, గ్యాస్, కడుపు నొప్పి బారిన పడే అవకాశం. 

  ఊరగాయ తినకండి

నేరేడు పండు తిన్న వెంటనే పసుపు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. కడుపు సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. శరీరం లేదా కడుపులో మంట వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది. 

  పసుపు తినొద్దు