బొప్పాయి పాలు చేసే మేలేంతో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Jyothi Gadda
25 June 2024
బొప్పాయి పండులాగే దీని పాలలో కూడా అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. విటమిన్ ఎ మీ కంటి చూపును మెరుగుపరుస్తుంది.
పచ్చి బొప్పాయి నుండి లభించే పాలను రబ్బరు పాలు అంటారు. దీనిని ప్రొటీయోలైటిక్ ఎంజైమ్ పపైన్ అంటారు. ఔషధ గుణాలు కలిగిన ఈ ఎంజైమ్ మంట, జీర్ణక్రియ మొదలైన వాటికి ఉపయోగపడుతుంది.
పచ్చి బొప్పాయిలను పొడవుగా గీసి అల్యూమినియం ట్రే ద్వారా పాలను సేకరిస్తారు. ఇలా సేకరించిన పాలను ఆ తర్వాత సరిగ్గా ప్రాసెస్ చేస్తారు. పూర్తిగా సిద్ధం చేసిన బొప్పాయి పాలను అనేక చికిత్సలకు ఔషధంగా ఉపయోగిస్తారు.
బొప్పాయిలో విటమిన్ ఎ, సి కాకుండా విటమిన్ ఇ, ఫోలేట్, పొటాషియం, డైటరీ ఫైబర్ కూడా ఉన్నాయి. డైటరీ ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పొటాషియం శరీరంలోని ద్రవాలను సమతుల్యం చేస్తుంది.
బొప్పాయిలో ఉండే పపైన్ అనే పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బొప్పాయి పాలు తాగడం వల్ల కడుపు ఉబ్బరం,మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు నయమవుతాయి. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
వ్యాధులతో పోరాడాలంటే రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి. బొప్పాయిలో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది సంక్రమణను నివారించడానికి సహాయపడుతుంది.
కొంతమంది బొప్పాయి, లాక్టోస్‌లకు అలర్జీ వస్తుంది. కాబట్టి బొప్పాయి పాలను తీసుకునే ముందు అందులోని కంటెంట్‌ను తెలుసుకోవడం మంచిది. మీకు అలెర్జీ ఉంటే, దానిని తీసుకోకపోవడమే మంచిది.
ఏదైనా హోం రెమెడీ లేదా ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. సమతుల్య ఆహారంలో బొప్పాయి పాలను కూడా మితంగా తీసుకోవాలి. అతిగా తీసుకుంటే ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది.