
రోజంతా శ్రమించిన తర్వాత ప్రతి ఒక్కరూ కోరుకునేది ప్రశాంతమైన నిద్ర. శరీరం, మనస్సు రీఛార్జ్ కావడానికి బెడ్‌రూమ్ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉండాలి. కానీ మనకు తెలియకుండానే పడకగదిలో ఉంచే కొన్ని వస్తువులు నిద్రలేమికి, మనశ్శాంతి లోపించడానికి మరియు వాస్తు దోషాలకు కారణమవుతున్నాయి. బెడ్‌రూమ్ నుంచి వెంటనే తొలగించాల్సిన ఆ 5 ముఖ్యమైన వస్తువులేంటో ఇప్పుడు చూద్దాం:
చాలామందికి బెడ్‌రూమ్‌లో టీవీ చూడటం లేదా పడుకునే ముందు ఫోన్ వాడటం అలవాటు. వీటి నుంచి వెలువడే బ్లూ లైట్ శరీరంలో నిద్రను రప్పించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని ఆపివేస్తుంది. ఇది నిద్రలేమికి మరియు కంటి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి పడుకునే ప్రదేశానికి ఎలక్ట్రానిక్ వస్తువులను దూరంగా ఉంచాలి.
వాస్తు, మానసిక శాస్త్రం ప్రకారం.. ఆగిపోయిన గడియారాలు పురోగతికి అడ్డంకిగా మారతాయి. అలాగే పగిలిన లేదా విరిగిన అద్దాలు ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి. ఇవి బెడ్‌రూమ్‌లో ఉంటే మనస్సులో నిరంతరం ఆందోళన, ఒత్తిడి పెరుగుతాయి.
మంచం కింద ఖాళీ స్థలం ఉంది కదా అని చాలామంది పాత పెట్టెలు, బూట్లు, నిరుపయోగమైన వస్తువులను అక్కడ పడేస్తుంటారు. దీనివల్ల పడకగదిలో గాలి వెలుతురు సరిగ్గా ఆడవు. మంచం కింద చెత్త పేరుకుపోవడం వల్ల నిద్రలో కలతలు, చెడు కలలు వచ్చే అవకాశం ఉందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
బెడ్‌రూమ్‌లో జీవం లేని ప్లాస్టిక్ మొక్కలు లేదా ఎండిపోయిన పూల గుత్తులను ఉంచకూడదు. ఇవి గదిలోని తాజాదనాన్ని దెబ్బతీస్తాయి. బెడ్‌రూమ్‌లో నిరంతరం ఆక్సిజన్ అందించే ఇండోర్ ప్లాంట్లు ఉదాహరణకు మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ మాత్రమే ఉంచడం మంచిది.
బెడ్‌రూమ్‌ను ఆఫీసు గదిలా మార్చకూడదు. వర్క్ ఫైళ్లు, ఆఫీసు ల్యాప్‌టాప్‌లు, వ్యాపార పత్రాలు పడకగదిలో ఉంచితే, పడుకునేటప్పుడు కూడా ఆఫీసు పని ఒత్తిడే గుర్తుకొస్తుంది. దీనివల్ల మెదడు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోలేదు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..