రోజూ 10 నిమిషాల యోగాతో మీ జీవితాన్ని మార్చుకోండి: ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్‌లో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అందరికీ సవాలుగా మారింది. అయితే, సంపూర్ణ ఆరోగ్యానికి గంటల తరబడి వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ ఉదయం కేవలం 10 నిమిషాల పాటు యోగా కోసం కేటాయిస్తే, అది మీ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని అద్భుతంగా మెరుగుపరుస్తుంది. యోగా అనేది మనస్సును, శరీరాన్ని అనుసంధానించే ఒక అద్భుతమైన ప్రాచీన జీవన విధానం. రోజుకు 10 నిమిషాల యోగా వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

రోజూ 10 నిమిషాల యోగాతో మీ జీవితాన్ని మార్చుకోండి: ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
10 Minute Yoga
Image Credit source: Tv9 marathi

Updated on: Jul 01, 2026 | 8:22 AM

రోజుకు కేవలం 10 నిమిషాల పాటు యోగా సాధన చేయడం వల్ల మన జీవితంలో అద్భుతమైన సానుకూల మార్పులు వస్తాయని ఆయుర్వేద, ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. యోగా అనేది మనస్సును, శరీరాన్ని అనుసంధానించే ఒక ప్రాచీన ప్రక్రియ. ప్రతిరోజూ ఉదయాన్నే కొద్దిసేపు యోగా చేయడం వల్ల రోజంతా కావలసినంత శక్తి లభిస్తుంది, మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరిగి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి. ప్రతి రోజూ ఉదయాన్నే 10 నిమిషాల యోగా వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

రోజంతా కావలసినంత ఎనర్జీ: ఉదయాన్నే యోగా చేయడం వల్ల శరీరం చురుగ్గా మారుతుంది. ఇది మీ అలసటను దూరం చేసి, రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా పనులు చేసుకోవడానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.

మెరుగైన ఏకాగ్రత, జ్ఞాపకశక్తి: యోగాసనాలలో శ్వాస ప్రక్రియ (Breathing) అత్యంత ముఖ్యం. ఇది మెదడుకు ఆక్సిజన్ సరఫరాను గణనీయంగా పెంచుతుంది. ఫలితంగా ఏకాగ్రత (Focus), జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి.

ఇవి కూడా చదవండి

ఒత్తిడి, ఆందోళనల నుండి ఉపశమనం: యోగా మన నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. రోజువారీ జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడి, ఆందోళన (Anxiety), డిప్రెషన్‌ను తగ్గించి, మనస్సుకు గాఢమైన ప్రశాంతతను చేకూరుస్తుంది.

శరీర ఫ్లెక్సిబిలిటీ, ఇమ్యూనిటీ: యోగాసనాలు శరీరంలోని ప్రతి కండరాన్ని ఉత్తేజపరుస్తాయి. దీనివల్ల శరీరానికి మంచి వశ్యత (Flexibility) లభిస్తుంది. అలాగే, ఇది శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, సీజనల్ వ్యాధుల నుండి రక్షిస్తుంది.

గుండె, శ్వాసకోశ ఆరోగ్యం: క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. శ్వాస సంబంధిత సమస్యలు నియంత్రణలోకి వస్తాయి.

యోగా చేసేటప్పుడు తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు:

ఉదయం నిద్ర లేవగానే శరీరం కొంచెం స్టిఫ్‌గా (గట్టిగా) ఉంటుంది. అందుకే నేరుగా కఠినమైన ఆసనాలు వేయకూడదు. ఆసనాలు ప్రారంభించే ముందు శరీరాన్ని సిద్ధం చేయడానికి కొన్ని తేలికపాటి వార్మప్ వ్యాయామాలు (Light exercises) చేయాలి. యోగా సాధన చేయడానికి వయస్సు, శరీర రకం లేదా ఫిట్‌నెస్ స్థాయితో సంబంధం లేదు. ఎవరైనా దీనిని సులభంగా ప్రారంభించవచ్చు. అయితే, హై బీపీ, లో బీపీ, ఇటీవల శస్త్రచికిత్సలు జరిగిన వారు లేదా తీవ్రమైన గాయాలు ఉన్నవారు నిపుణుల సమక్షంలో లేదా వైద్యుల సలహా మేరకు మాత్రమే యోగా చేయడం సురక్షితం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us