చిరుతను గెలిచిన కోతి… ఫిదా అవుతున్న నెటిజన్లు

సాహసం చేయలేక తన ఆకలిని చంపుకొని చెట్టు దిగేసింది. కోతి చూపించిన తెలివికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే ఫారెస్ట్ అధికారి తాను పోస్ట్ చేసిన వీడియోకు ఓ అద్భుతమైన క్యాప్షన్‌ను జోడించారు. 

చిరుతను గెలిచిన కోతి... ఫిదా అవుతున్న నెటిజన్లు
Follow us

|

Updated on: Jun 05, 2020 | 3:10 PM

జంతుప్రపంచంలో జరుగుతున్న వింతలు.. విశేషాలు అందరిని ఆకట్టుకుంటాయి. కరోనాతో ఇంటికే పరిమితమైన జనం నెట్టింట్లో తెగ బిజీగా మారారు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా.. దానిని వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఓ ఫారెస్ట్ అధికారి సుశాంత నంద.. తన ట్విటర్‌లో పెట్టిన వీడియో తెగ వైరల్‌గా మారింది. ఎందుకంటే ఓ కోతి చిరుతను వణికించింది… అవును ఇది నిజం. కోతికి…చిరుతకు మధ్య జరిగిన ఓ చిన్నపాటి యుద్ధంలో చిరుత ఓడిపోయింది. ప్రాణాలు కాపాడుకునేందుకు అడవిదారి పట్టింది.

చిరుత ఓ కోతిని వెంటాడింది. అది పరుగు పరుగునా చెట్టెక్కింది… హమ్మయ్యా బతికిపోయాను అనుకునేలోపే చిరుత కూడా చెట్టు ఎక్కింది. ప్రాణాలు కాపాడుకునేందుకు తన మెదడుకు పనిపెట్టింది. అంతే.. చెట్టు చిటారు కొమ్మకు చేరింది. ఇక పోటీకి సై.. అంటూ సైగ చేసింది. దీంతో రెచ్చిపోయింది చిరుత. కోతిలా కొమ్మ చివరకు వెళ్లింది. అక్కడికి వచ్చిన చిరుతను కింద పడేయటానికి కొమ్మలను ఊపటం మొదలు పెట్టింది. అంతే.. కోతి ఉపయోగంచిన తెలివికి బిత్తర పోయింది చిరుత. ఇక సాహసం చేయలేక తన ఆకలిని చంపుకొని చెట్టు దిగేసింది. కోతి చూపించిన తెలివికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే ఫారెస్ట్ అధికారి తాను పోస్ట్ చేసిన వీడియోకు ఓ అద్భుతమైన క్యాప్షన్‌ను జోడించారు.  అది చదివిన నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.