ఆ రోజు ధోనిని చూసి చాలా భయపడ్డాను: కుల్దీప్

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని… మైదానం వెలుపలైనా.. లోపలైనా ఎప్పుడూ కూడా శాంతంగానే వికెట్ల వెనుక నిలబడి పక్కా ప్రణాళికలు సిద్దం చేస్తుంటాడు ఈ మాజీ ఇండియన్ కెప్టెన్. పరిస్థితి ఎలాంటిదైనా కావచ్చు.. ధోని కోప్పడిన సందర్భాలు మాత్రం చాలా తక్కువ. టీం ఓటమి అంచుల్లో ఉన్నా కూడా ఎంతో ప్రశాంతంగా విన్నింగ్ షాట్ కొట్టి గెలిపిస్తాడు. అలాంటి ధోని సహనం కోల్పోవడం తొలిసారిగా చూశానని స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తెలిపాడు. 2017లో శ్రీలంకతో జరిగిన […]

ఆ రోజు ధోనిని చూసి చాలా భయపడ్డాను: కుల్దీప్
Follow us

|

Updated on: Apr 18, 2020 | 6:49 PM

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని… మైదానం వెలుపలైనా.. లోపలైనా ఎప్పుడూ కూడా శాంతంగానే వికెట్ల వెనుక నిలబడి పక్కా ప్రణాళికలు సిద్దం చేస్తుంటాడు ఈ మాజీ ఇండియన్ కెప్టెన్. పరిస్థితి ఎలాంటిదైనా కావచ్చు.. ధోని కోప్పడిన సందర్భాలు మాత్రం చాలా తక్కువ. టీం ఓటమి అంచుల్లో ఉన్నా కూడా ఎంతో ప్రశాంతంగా విన్నింగ్ షాట్ కొట్టి గెలిపిస్తాడు. అలాంటి ధోని సహనం కోల్పోవడం తొలిసారిగా చూశానని స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తెలిపాడు.

2017లో శ్రీలంకతో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో కుశాల్ పెరీరా నా బౌలింగ్‌లో కవర్స్ మీదుగా బౌండరీ కొట్టాడు. దీనితో ఫీల్డింగ్ మార్చాలంటూ ధోని భాయ్ వికెట్ల వెనుక నుంచి అరిచాడు. అది నాకు వినిపించలేదు. యధావిధిగా తర్వాత బంతి వేశాను. ఈసారి రివర్స్ స్వీప్‌లో మళ్ళీ ఫోర్ బాదాడు. అప్పుడు ధోని భయ్యా నా దగ్గరకు వచ్చి ‘నేను ఏమైనా పిచ్చోడిలా ఉన్నానా.. 300 వన్డేలు ఆడాను. నువ్వు అసలు నా మాటను వినిపించుకోవట్లేదు అని కోప్పడ్డాడు. ఆ రోజు ధోనిని చూసి చాలా భయపడ్డాను అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు. మ్యాచ్ అనంతరం ధోని దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పానని.. అప్పుడు ధోని ’20 ఏళ్లుగా కోప్పదలేదని నవ్వాడంటూ కుల్దీప్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఘటనను గుర్తు చేసుకున్నాడు.

Also Read:

‘రంజాన్’ వరకు లాక్‌డౌన్ పొడిగించాలి.. ముస్లిం కార్యకర్త వినతి..

శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలకు షాక్.. గుర్తింపు రద్దు చేసిన ఇంటర్ బోర్డు..

మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

మూడు నెలలు అద్దె అడగకండి… సర్కార్ కీలక నిర్ణయం..

ఏపీలో ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు.. అదంతా ఫేకేనట.. అసలు నిజమిదే..

అక్కడ కరోనా నెగటివ్ రాకున్నా.. బాధితులను ఇంటికి పంపేస్తారట.!