హీరో అయితే సినిమాల్లో ఓకే.. బయట కాదు: బొత్స

| Edited By:

Apr 09, 2019 | 9:16 AM

టాలీవుడ్ అగ్రహీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తరుచుగా వివిధ వివాదాలతో మీడియాకు ఎక్కుతున్నారు. తాజాగా.. విజయనగరం చీపురుపల్లిలో నడిరోడ్డులో ఓ అభిమానిపై నటుడు బాలకృష్ణ చేయిచేసుకున్నట్లు ఉన్న వీడియో హల్‌చల్ అవుతుంది. ఈ సంఘటనపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మీరు నటులు అయితే.. మీ యాక్షన్‌ను సినిమాల్లో చూపించుకోండి.. ఇలా వీధుల్లో కాదని హెచ్చరించారు. మా ఊరు వచ్చి మా కుర్రాళ్లను కొడతానంటే ఇక్కడ ఎవరూ చూస్తూ ఊరుకోమని ఘటుగా విమర్శించారు. బాధితుడు టీడీపీ […]

హీరో అయితే సినిమాల్లో ఓకే.. బయట కాదు: బొత్స
Follow us on

టాలీవుడ్ అగ్రహీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తరుచుగా వివిధ వివాదాలతో మీడియాకు ఎక్కుతున్నారు. తాజాగా.. విజయనగరం చీపురుపల్లిలో నడిరోడ్డులో ఓ అభిమానిపై నటుడు బాలకృష్ణ చేయిచేసుకున్నట్లు ఉన్న వీడియో హల్‌చల్ అవుతుంది. ఈ సంఘటనపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మీరు నటులు అయితే.. మీ యాక్షన్‌ను సినిమాల్లో చూపించుకోండి.. ఇలా వీధుల్లో కాదని హెచ్చరించారు. మా ఊరు వచ్చి మా కుర్రాళ్లను కొడతానంటే ఇక్కడ ఎవరూ చూస్తూ ఊరుకోమని ఘటుగా విమర్శించారు. బాధితుడు టీడీపీ కార్యకర్తే అయినప్పటికీ మా ఊరు ప్రాంతానికి చెందిన వాడు కాబట్టి అతని తరపున మాట్లాడుతున్నామని బొత్స తెలిపారు. ఆ కుర్రాడికి బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక పార్టీ లీడర్ అయి ఉండి, కనీస విలువలు, వ్యక్తిత్వం లేకుండా ఇలా వీధుల్లోకి వచ్చి కొట్టడమేంటని నిలదీశారు. ఇక మున్ముందు ఇలాంటివి జరిగితే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించారు బొత్స.