చైనాలోని వూహాన్ లో కరోనా వైరస్ మటు మాయమైనట్టే ! అందుకే అక్కడ కెన్నెల్ క్లబ్స్ నిర్వాహకులు సరదాగా డాగ్ షోలు, కాంపిటీషన్లను ఏర్పాటు చేశారు. ‘పోస్ట్ కరోనా వైరస్ వూహాన్’ పేరిట నిర్వహించిన ఈ పోటీల్లో రకరకాల జాతుల శునకాలను వాటి యజమానులు ప్రదర్శించారు. దాదాపు యాభై జాతుల కుక్కలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఇక్కడ అమెరికన్ కెన్నెల్ క్లబ్ కూడా ఉంది. చైనా క్లబ్బులతో బాటు ఈ క్లబ్ కూడా వీటిలో భాగస్వామ్యం వహించింది.