కనిపించకుండా పోయిన మహిళ సముద్రంలో తేలుతూ కనిపించింది….!

భూమ్మీద నూకలు మిగిలి ఉంటే చచ్చినా చావు మన తెరువురాదు.. కొలంబియాలో ఎంజెలికా గైటన్‌ అనే ఓ మహిళకు అట్టాగే జరిగింది.. సముద్రమంత కష్టాలు వచ్చిపడటంతో సముద్రంలోకి దూకి చనిపోవాలనుకుంది..

కనిపించకుండా పోయిన మహిళ సముద్రంలో తేలుతూ  కనిపించింది....!
Follow us

|

Updated on: Sep 30, 2020 | 2:28 PM

భూమ్మీద నూకలు మిగిలి ఉంటే చచ్చినా చావు మన తెరువురాదు.. కొలంబియాలో ఎంజెలికా గైటన్‌ అనే ఓ మహిళకు అట్టాగే జరిగింది.. సముద్రమంత కష్టాలు వచ్చిపడటంతో సముద్రంలోకి దూకి చనిపోవాలనుకుంది.. మునిగితేగా…! ఎనిమిది గంటలపాటు నీటిమీదనే తేలుతూ ఉంది.. మత్స్యకారుల కంటపడటంతో చావాలనుకున్న ఆమె బతికిబయటపడింది.. తనకిది పునర్జన్మ అని, ఆ భగవంతుడు తన చావును కోరుకోలేదని తెగ సంబరపడిందామె! అసలేం జరిగిందంటే… ఎంజెలికా గైటన్‌ జీవితంలో అన్నీ ఒడిదుడుకులే! పెళ్లయిన దగ్గర్నుంచి భర్త చేతిలో హింసకు గురవుతూనే వచ్చింది.. ఇద్దరు చిన్న పిల్లలు ఉండటంతో భర్త పెట్టే హింసను భరిస్తూ వచ్చింది.. దెబ్బలకు తాళలేక చాలాసార్లు పోలీసులకు కంప్లయింట్‌ కూడా చేసింది.. పోలీసులేమో అతడిని ఓ రోజు జైలులో పెట్టడం, మర్నాడు క్లాస్‌ తీసుకొని వదిలేయడం జరిగేవి.. పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు రెండు దెబ్బలెక్కువ కొట్టేవాడు.. రెండేళ్ల కిందట ఆమెను చంపే ప్రయత్నం కూడా చేశాడా దుర్మార్గుడు.. అక్కడే ఉంటే ఏదో ఓ రోజున అతడి చేతిలో చావాల్సి వస్తుందనుకున్న ఎంజెలికా గైటన్‌ ఇంట్లోంచి పారిపోయింది.. ఆరు నెలలు అలా వీధుల్లోనే గడిపింది.. తర్వాత కామినో డిఫే రెస్క్యూ సెంటర్‌లో ఆశ్రయం దొరకడంతో అక్కడి వెళ్లింది.. అక్కడ మట్టుకు ఎన్నాళ్లని ఉంచుకుంటారు. గడువు తీరాక బయటకు పంపించేశారు.. ఏం చేయాలో పాలుపోక ఆమె చచ్చిపోదామని నిర్ణయించుకుంది.. కొలంబియా సముద్రంలో దూకేసింది.. కాసేపటికి స్పృహ కోల్పోయింది.. అలా ఎనిమిది గంటలపాటు సముద్రంలోనే తేలుతూ ఉంది.. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు దూరంగా ఆమె నీటిలో తేలుతూ కనిపించింది.. మొదట ఏదో చెక్క అయి ఉంటుందనుకున్నారు.. దగ్గరకెళ్లి చూస్తే మనిషి.. వెంటనే ఆమెను రక్షించి ఒడ్డుకు చేర్చారు.. ఆ విధంగా ఆమె చావును జయించింది..

Latest Articles
ఐటీఆర్‌ ఫైల్‌ చేసే ముందు గృహ రుణ ప్రయోజనాలు.. రూ.7 లక్షలు ఆదా
ఐటీఆర్‌ ఫైల్‌ చేసే ముందు గృహ రుణ ప్రయోజనాలు.. రూ.7 లక్షలు ఆదా
ఆస్తమా పేషెంట్స్ ఏది తినాలి..? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలంటే
ఆస్తమా పేషెంట్స్ ఏది తినాలి..? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలంటే
అమ్మబాబోయ్.. ఇదేం అరాచకం..
అమ్మబాబోయ్.. ఇదేం అరాచకం..
ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోడీ..రాఖీ కట్టిన వృద్ధురాలు..ఓటర్లతో..
ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోడీ..రాఖీ కట్టిన వృద్ధురాలు..ఓటర్లతో..
చెన్నైకి బ్యాడ్‌న్యూస్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..
చెన్నైకి బ్యాడ్‌న్యూస్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!