హెల్మెట్ లేకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని బైక్ నడిపిన మహిళ.. ఫోన్ పేలడంతో మృతి..

కాన్పూర్‌లో స్కూటర్‌పై వెళుతుండగా జేబులో ఉన్న మొబైల్ ఫోన్ అకస్మాత్తుగా పేలడంతో ఓ మహిళ మృతి చెందింది. మహిళ జేబులో ఉన్న మొబైల్ ఫోన్ పేలడంతో బైక్ అదుపు తప్పి రోడ్డుపై ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కింద పడిన మహిళ తలపై బైక్ పడిపోయింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో మహిళ హెల్మెట్ ధరించలేదు. మహిళ కింద పడిపోవడంతో చుట్టుపక్కల భారీ సంఖ్యలో జనం గుమిగూడారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి గాయపడిన మహిళను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

హెల్మెట్ లేకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని బైక్ నడిపిన మహిళ.. ఫోన్ పేలడంతో మృతి..
Up Woman Dies As Mobile Phone Blasts
Follow us

|

Updated on: Apr 27, 2024 | 9:47 AM

రోడ్డు ప్రమాదాలు నివారణకు సేఫ్టీ పద్దతులను అధికారులు, ఎన్ని సార్లు చెప్పినా వాహన మీద ప్రయాణించేవారు పట్టించుకోవడం లేదు. అలా హెల్మెట్ లేకుండా స్కూటర్‌పై ప్రయాణిస్తూ రోడ్డుమీద పడి ఓ మహిళ ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. కాన్పూర్‌లో స్కూటర్‌పై వెళుతుండగా జేబులో ఉన్న మొబైల్ ఫోన్ అకస్మాత్తుగా పేలడంతో ఓ మహిళ మృతి చెందింది. మహిళ జేబులో ఉన్న మొబైల్ ఫోన్ పేలడంతో బైక్ అదుపు తప్పి రోడ్డుపై ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కింద పడిన మహిళ తలపై బైక్ పడిపోయింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో మహిళ హెల్మెట్ ధరించలేదు.

మహిళ కింద పడిపోవడంతో చుట్టుపక్కల భారీ సంఖ్యలో జనం గుమిగూడారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి గాయపడిన మహిళను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే మొబైల్ ఫోన్ పేలడంతో ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి చెందింది. ఆస్పత్రికి చేరుకునేలోపే మహిళ మృతి చెందినట్లు ఆసుపత్రి అధికారులు ప్రకటించారు.

బుధవారం (ఏప్రిల్ 24) ఉదయం 10 గంటలకు మహిళ తన స్కూటర్‌పై కాన్పూర్ వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. మృతి చెందిన మహిళను ఫరూఖాబాద్ జిల్లా నెహ్రారియా గ్రామానికి చెందిన పూజ (28)గా గుర్తించారు. ఆ మహిళ కాన్పూర్ రైల్వే స్టేషన్ నుంచి ముంబైకి వెళుతున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న మహిళ

చౌబేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాన్‌పూర్ విలేజ్ సమీపంలోని కాన్పూర్-అలీఘర్ హైవేపై ఉన్న పెట్రోల్ పంప్ ముందు ఈ విషాద సంఘటన జరిగింది. మహిళ హెల్మెట్ ధరించలేదని, చెవుల్లో ఇయర్‌ఫోన్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె అతి వేగంతో స్కూటర్‌ను నడుపుతోంది.. డివైడర్‌ను ఢీకొనడంతో తలకు పెద్ద గాయమైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..