మళ్లీ హెచ్చరించిన వాట్సాప్ సంస్థ.. ఈ ఫోన్లలో!

| Edited By:

Dec 26, 2019 | 4:43 PM

2020 ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పాత వర్షన్ ఉన్న ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని వాట్సాప్ యాజమాన్యం మళ్లీ ప్రకటన చేసింది. ఆండ్రాయిడ్ 2.3.7 కన్నా తక్కువ వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్లతో పాటు ఐఓఎస్ 8 కన్నా తక్కువ వర్షన్ ఓఎస్ ఉన్న ఫోన్లలో వాట్సాప్ నిలిచిపోతుందని సంస్థ వెల్లడించింది. అటు డిసెండర్ 31 నుంచి అన్ని విండోస్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయడం ఆగిపోతోంది. ఇంకా పాత ఆపరేటింగ్ సిస్టమ్‌తో […]

మళ్లీ హెచ్చరించిన వాట్సాప్ సంస్థ.. ఈ ఫోన్లలో!
Follow us on

2020 ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పాత వర్షన్ ఉన్న ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని వాట్సాప్ యాజమాన్యం మళ్లీ ప్రకటన చేసింది. ఆండ్రాయిడ్ 2.3.7 కన్నా తక్కువ వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్లతో పాటు ఐఓఎస్ 8 కన్నా తక్కువ వర్షన్ ఓఎస్ ఉన్న ఫోన్లలో వాట్సాప్ నిలిచిపోతుందని సంస్థ వెల్లడించింది. అటు డిసెండర్ 31 నుంచి అన్ని విండోస్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయడం ఆగిపోతోంది. ఇంకా పాత ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఫోన్లు వాడుతున్నవారి సంఖ్య చాలా తక్కువని..అందుకే పాత ఓఎస్ ఉన్న ఫోన్లకు సేవల్ని నిలిపివేస్తే ఎక్కువ మందిపై ప్రభావం ఉండదని చెబుతోంది.

అయితే.. ఇందుకు వాట్సాప్ వినియోగదారులెవరూ చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఆండ్రాయిడ్ 2.3.7 లేదా Android Gingerbread పైన నడుస్తోన్న పరికరాలు కేవలం 03. శాతం మాత్రమే ఉన్నాయి. కాగా.. ప్రస్తుతం వాట్సాప్ సంస్థ తీసుకొస్తున్న ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు ఇన్‌కమింగ్ కాల్స్ గురించిన సమాచారాన్ని తెలుసుకోచ్చట. ఇప్పుడు సాధారణ కాల్ మాట్లాడుతుండగా.. మరొక కాల్ వస్తే ఎలా తెలుస్తుందో.. వాట్సాప్‌లోనూ అదే సిస్టమ్‌ని తీసుకురానున్నారట. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఐఫోన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి చేయబడింది.