వీడియో వైరల్: బుల్లెట్ నడుపుతూ బోర్లాపడ్డ జెర్సీ హీరోయిన్..

| Edited By:

Jun 26, 2020 | 1:22 PM

సాధారణంగా హీరోల కంటే హీరోయిన్స్ బుల్లెట్ నడుపుతుంటే అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. అలాగే సరదగా బైక్ నడపాలని ప్రయత్నించి.. అదుపు తప్పి కింద పడిపోయింది జెర్సీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. అయితే ఇది చాలా కాలం క్రితం జరిగిన..

వీడియో వైరల్: బుల్లెట్ నడుపుతూ బోర్లాపడ్డ జెర్సీ హీరోయిన్..
Follow us on

సాధారణంగా హీరోల కంటే హీరోయిన్స్ బుల్లెట్ నడుపుతుంటే అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. అలాగే సరదగా బైక్ నడపాలని ప్రయత్నించి.. అదుపు తప్పి కింద పడిపోయింది జెర్సీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. అయితే ఇది చాలా కాలం క్రితం జరిగిన ఇన్సిడెంట్. అయితే ఇటీవల ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతూ శ్రీనాథ్‌ని ఆట పట్టిస్తున్నారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో ఇది చోటు చేసుకోవడం విశేషం.

కాగా ఈ వీడియోను శ్రద్ధా షేర్ చేస్తూ.. ఈ వీడియో ‘కృష్ణ అండ్ హీజ్ లీల’ అనే సినిమా షూటింగ్‌‌లో జరిగింది. 2017లో నందిహిల్స్‌లో షూట్ జరుగుతున్న సమయంలో డైరెక్టర్ రవికాంత్ నాకు బుల్లెట్ నడపడం వచ్చా అని అడిగారు. బైక్ డ్రైవింగ్ తనకు రాదని.. అయినా ట్రై చేస్తా అంటూ చెప్పింది. వెంటనే అక్కడ ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకుని డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశాను. అయితే మలుపు తిప్పే క్రమంలో బ్యాలెన్స్ ఆగక కిందపడిపోయా. మెల్లగా పడటంతో ఏమీ కాలేదంటూ పోస్ట్ చేసింది శ్రీనాథ్‌’. ఇది మూడు సంవత్సరాల క్రితం వీడియో అయినా.. ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా శ్రద్ధా శ్రీనాథ్.. నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.