గవర్నర్‌ను మార్చాలంటూ వీహెచ్ డిమాండ్!

తెలంగాణకు కొత్త గవర్నర్‌ను నియమించాలంటూ మరోసారి కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వీహెచ్‌ లేఖ రాశారు. తెలంగాణకు కొత్త గవర్నర్‌ను నియమించాలని విన్నవించారు. కిరణ్ బేడీ లాంటి వ్యక్తిని గవర్నర్ గా పంపాలని ఆయన కేంద్రానికి సూచించారు. ముఖ్యమంత్రులకే గవర్నర్ అనుకూలంగా ఉన్నారంటూ విమర్శించారు. న‌రసింహన్‌ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు యూపీఏ ప్రభుత్వం గవర్నర్‌గా నియమించింది. అటు తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా నరసింహన్‌నే కొనసాగిస్తున్నారు. గవర్నర్‌పై పలుమార్ల […]

గవర్నర్‌ను మార్చాలంటూ వీహెచ్ డిమాండ్!

Updated on: Jun 15, 2019 | 9:37 PM

తెలంగాణకు కొత్త గవర్నర్‌ను నియమించాలంటూ మరోసారి కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వీహెచ్‌ లేఖ రాశారు. తెలంగాణకు కొత్త గవర్నర్‌ను నియమించాలని విన్నవించారు. కిరణ్ బేడీ లాంటి వ్యక్తిని గవర్నర్ గా పంపాలని ఆయన కేంద్రానికి సూచించారు. ముఖ్యమంత్రులకే గవర్నర్ అనుకూలంగా ఉన్నారంటూ విమర్శించారు. న‌రసింహన్‌ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు యూపీఏ ప్రభుత్వం గవర్నర్‌గా నియమించింది. అటు తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా నరసింహన్‌నే కొనసాగిస్తున్నారు. గవర్నర్‌పై పలుమార్ల వీహెచ్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

Loading...
Unable to load recommendations.
Follow Us