దర్శకురాలి అవతారమెత్తబోతున్న వరలక్ష్మి

విలక్షణమైన నటిగా పేరు సంపాదించుకున్న వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఇప్పుడు మెగాఫోన్‌ పట్టుకుంటున్నారు.. కన్నామూచ్చి అనే తమిళ సినిమాతో దర్శకురాలిగా మారబోతున్నారు..

దర్శకురాలి అవతారమెత్తబోతున్న వరలక్ష్మి

Updated on: Oct 19, 2020 | 11:23 AM

విలక్షణమైన నటిగా పేరు సంపాదించుకున్న వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఇప్పుడు మెగాఫోన్‌ పట్టుకుంటున్నారు.. కన్నామూచ్చి అనే తమిళ సినిమాతో దర్శకురాలిగా మారబోతున్నారు.. కన్నామూచ్చి అంటే తెలుగులో దాగుడుమూతలు అని అర్థం. ఉమెన్‌ ఓరియంటెండ్‌గా రూపొందుతున్న ఈ సినిమాను తేనాండల్‌ ఫిల్స్మ్‌ సంస్థ నిర్మించనుంది..సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో విడుదల చేసిన వరలక్ష్మికి అందరి నుంచి అభినందనలు అందుతున్నాయి.. రాధికా శరత్‌కుమార్‌, జ్యోతికలు శుభాభినందనలు తెలిపారు. దర్శకురాలిగా సరికొత్త భూమికను పోషించబోతున్నానని, డైరెక్టర్‌గా తానేంటో నిరూపించుకుంటానని వరలక్ష్మి చెప్పారు. మంచి సినిమాతో ప్రేక్షకుల ముందు తలెత్తుకుని నిలబడతానని అన్నారు వరలక్ష్మి..