అమెరికాలో ప్రభుత్వ వ్యతిరేక తీవ్రవాద ముప్పు, ఎలర్ట్ వార్నింగ్ జారీ చేసిన హోంలాండ్ సెక్యూరిటీ విభాగం

అమెరికాలో జో బైడెన్ అధ్యక్షుడు కావడాన్ని ఖండిస్తూ  దేశీయంగా ప్రభుత్వ వ్యతిరేక తీవ్రవాద ముప్పు పొంచి ఉందని హోంలాండ్ సెక్యూరిటీ విభాగం హెచ్ఛరించింది.

  • Umakanth Rao
  • Publish Date - 2:44 pm, Thu, 28 January 21
అమెరికాలో ప్రభుత్వ వ్యతిరేక తీవ్రవాద ముప్పు, ఎలర్ట్ వార్నింగ్ జారీ చేసిన హోంలాండ్ సెక్యూరిటీ విభాగం

అమెరికాలో జో బైడెన్ అధ్యక్షుడు కావడాన్ని ఖండిస్తూ  దేశీయంగా ప్రభుత్వ వ్యతిరేక తీవ్రవాద ముప్పు పొంచి ఉందని హోంలాండ్ సెక్యూరిటీ విభాగం హెచ్ఛరించింది. ఈ మేరకు దేశ వ్యాప్త టెర్రరిజం అలర్ట్ ను ప్రకటించింది. సిధ్ధాంతపరంగా కొందరు హింసాత్మక తీవ్రవాదులు (రాడికల్స్)  ప్రభుత్వ అధికార బదలాయింపును వ్యతిరేకిస్తున్నారని, దేశంలో వారు హింసను ప్రేరేపించవచ్ఛునని సమాచారం అందినట్టు నేషనల్ టెర్రరిజం అడ్వైజరీ సిస్టం  పేర్కొంది. ఈ నెల 20 న అధ్యక్షునిగా  జో బైడెన్ పదవీ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగిందని, కానీ దీన్ని సహించలేని కొన్ని శక్తులు రాబోయే వారాలు, లేదా నెలల్లో ఉధృత దాడులకు దిగే ఆస్కారం ఉందని ఈ అడ్వైజరీ సిస్టం బులెటిన్ తెలిపింది. అల్లర్లను రెచ్చగొట్టేందుకు ఈ తీవ్రవాద శక్తులు అనేకమందిని సమీకరించే అవకాశాలు ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు.

జనవరి 6 న క్యాపిటల్ హిల్ లో జరిగిన అల్లర్లలో పాల్గొన్న ట్రంప్ మద్దతుదారులు స్తబ్దంగా లేరు.. వారు ఎన్నికైన అధికారులను, ప్రభుత్వ కేంద్రాలను టార్గెట్ గా చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. ఇప్పటికే సాయుధులైన తీవ్రవాద బృందాలకు చెందిన 150 మందితో బాటు పలువురిని ఫెడరల్ పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని వారు ప్రస్తావించారు. అనుమానాస్పదంగా ఉన్నవ్యక్తులు, వారి కార్యకలాపాల గురించి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.