AP Fly Overs: ఏపీలో శాపగ్రస్థ వారధులు

శాపగ్రస్థ వారధులు ఆ ఫ్లయ్ ఓవర్ లకి శాపం తగిలిందా.. అవి ఎప్పటికీ పూర్తికావా..రాష్ట్రంలోనే ప్రముఖ దేవుళ్ళ సన్నిధిలో ప్రారంభమైన ఆ వారధులు ఎందుకు పూర్తవడం లేదు.. ఇది యాదృచ్చికమా..నిజంగా శాపమా.. బెజవాడ అమ్మలగన్న అమ్మ సన్నిధి లోని కనకదుర్గ వారధి.తిరుపతిలోని శ్రీనివాసుడు చెంత ఉన్న గరుడ వారధి ఈ రెండు ఫ్లైఓవర్లు ఎప్పటికీ పూర్తికావా..రెండు వారధులకు శాపం తగిలిందా… అవును యాధృచ్చికమో లేక నిజంగా శాపమో తెలీదు కానీ రెండు ఫ్లైఓవర్లు నిర్మాణం మాత్రం పూర్తి […]

AP Fly Overs: ఏపీలో శాపగ్రస్థ వారధులు
Follow us

|

Updated on: Feb 14, 2020 | 8:23 PM

శాపగ్రస్థ వారధులు ఆ ఫ్లయ్ ఓవర్ లకి శాపం తగిలిందా.. అవి ఎప్పటికీ పూర్తికావా..రాష్ట్రంలోనే ప్రముఖ దేవుళ్ళ సన్నిధిలో ప్రారంభమైన ఆ వారధులు ఎందుకు పూర్తవడం లేదు.. ఇది యాదృచ్చికమా..నిజంగా శాపమా..

బెజవాడ అమ్మలగన్న అమ్మ సన్నిధి లోని కనకదుర్గ వారధి.తిరుపతిలోని శ్రీనివాసుడు చెంత ఉన్న గరుడ వారధి ఈ రెండు ఫ్లైఓవర్లు ఎప్పటికీ పూర్తికావా..రెండు వారధులకు శాపం తగిలిందా… అవును యాధృచ్చికమో లేక నిజంగా శాపమో తెలీదు కానీ రెండు ఫ్లైఓవర్లు నిర్మాణం మాత్రం పూర్తి కావడం లేదు ..ఏదో కారణంతో ఏళ్లకు ఏళ్లు సాగుతూనే ఉన్నాయి..పిల్లర్ల స్టేజ్ నుంచి ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బందులే.. అన్నీ సృష్టించిన ఇబ్బందులే.. కనకదుర్గ ఫ్లైఓవర్ బెజవాడప్రజలకు నాలుగేళ్లకు ట్రాఫిక్ తో చుక్కలు చూపిస్తోంటే గరుడ వారధి తిరుపతి ప్రజలకు నరకం చూపిస్తోంది. బెజవాడలోని ఫ్లైఓవర్ ను నాలుగేళ్ల క్రితం చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. కృష్ణాపుష్కరాలకల్లా ఫ్లైఓవర్ ను అందుబాటులోకి తెస్తామన్నారు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టుగా ఈ ఫ్లైఓవర్ ఇంతవరకూ పూర్తి కాలేదు..ఎన్నో ఆటంకాలతో ఆగిపోతూనే వస్తోంది. నత్తనడకన సాగుతూనే ఉంది. నిర్మాణ సంస్థ సోమా కంపెనీ ఆర్థిక ఇబ్బందులతో చేతులెత్తేసింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ ఫ్లైఓవర్ పై ఎన్నోసార్లు సమీక్షలునిర్వహించి సోమా కంపెనీని ఎన్నోసార్లువార్నింగ్ ఇచ్చినా పూర్తి కాలేదు. కేంద్రంనుంచి నిధులు విడుదల కాకపోవడం మరోకారణం.. ఎన్నో ఏళ్ల నుంచి బెజవాడ ప్రజలు పడుతున్న ఇబ్బందులకు ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో విముక్తి లభిస్తుందని ఎదురు చూస్తే ఫ్లైఓవర్ నిర్మాణం మొదలుపెట్టాక ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి..ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కారణంకా సంవత్సరాల తరబడి ట్రాఫిక్ ను కిలోమీటర్ల కొద్దీ పాలఫ్యాక్టరీవైపు మళ్లించడంతో నరకం అనుభవిస్తున్నారు. ఆరునెలల్లో పూర్తి చేయాల్సిన ఫ్లైఓవర్ నాలుగేళ్లుగా ఇంకా పూర్తి కాలేదు ఇంకా ఎప్పటికి పూర్తవుతుందో కూడా తెలీదు.. . విజయవాడ – హైదరాబాద్‌ జాతీయ రహదారి ఎన్‌హెచ్‌ 65పై దుర్గగుడి వద్ద ఫ్లైవోవర్‌ నిర్మాణంకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు 2015 ఏడాది చివరిలో శంకుస్థాపన చేశారు.ఫ్లెవోవర్‌ నిర్మాణం వరకు రూ.282 .4 కోట్ల మేర కేంద్ర ప్రభుత్వ వ్యయంతో 2.062 కిలో మీటర్ల మేర నిర్మాణం కానున్న ఈ బ్రిడ్జిని 2016లో జరిగిన కృష్ణాపుష్కరాల నాటికే ఓ కొలిక్కి తెస్తామని, ఆ ఏడాది చివరికి పూర్తి చేసిప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అపట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వపెద్దలు ప్రకటనలు గుప్పించారు. విజయవాడ నగర పాలక సంస్థ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద పుష్కర ఘాట్ల నుండి కుమ్మరిపాలెం పెట్రోల్‌ బంకుల వరకు 1955 మీటర్ల పొడవు, మరో 570 మీటర్ల ర్యాంపులతో కలిపి మొత్తంగా 2.062 కిలో మీటర్ల పొడవుతో 47 పిల్లర్లతో ఈ ఫ్లైవోవర్‌ నిర్మాణం జరుగుతుందని అధికారులు ప్రకటించారు. అయితే ముందుగా ప్రకటించిన విధంగా కృష్ణాపుష్కరాల నాటికి ఫ్లైవోవర్‌ నిర్మాణంను ప్రభుత్వం పూర్తిచేయించలేకపోగా కేవలం అప్పటికి 40 శాతంమేర పనులను మాత్రమే పూర్తి చేయడంతో పుష్కరాలకు ప్రజలు నానా అవస్థలు పడ్డారు.. . పోనీ ఆతర్వాత అయినా వేగంగా పూర్తిచేశారా అంటే అదీ లేదు..స్వయంగా చంద్రబాబు ఎన్నోసార్లు ఫ్లైఓవర్ దగ్గరకు వెళ్లి పరిశీలించినా ప్రయోజనం లేకుండా పోయింది..కృష్ణాపుష్కరాల నాటికి పనులు పూర్తి చేయలేకపోయిన ప్రభుత్వ పెద్దలు,అధికారులు, నిర్మాణసంస్థ సోమా ప్రతినిధులు ఆ తర్వాత అయినా వేగంగా పనులు పూర్తి చేయడంను విస్మరించి ఒకింత మందకొడిగానే పనులు చేస్తూ వచ్చారు. దాదాపుగా రెండున్నర సంత్సరాలు కనీసం ద్వి చక్ర వాహనాలను సైతం అనుమతించకుండా ట్రాఫిక్‌ను నిలిపివేసినా పనులు మాత్రం ముందుకుసాగలేదు. కృష్ణానదివెంబడి పిల్లర ఏర్పాటులో జాప్యం, రాష్ట్ర ప్రభుత్వం పలు మార్లు డిజైన్ల సూచనలుచేయడం , భారీ భారీ వై పిల్లర్ల నిర్మాణం , ప్లైవోవర్‌లో మలుపులు కారణంగా అప్పట్లో ప్లైవోవర్‌ నిర్మాణం పూర్తవలేదని, 2017 చివరికి ప్లైవోవర్‌ నిర్మాణం పూర్తవుతుందని అధికారులు ప్రకటించారు.కానీ 2018 డిసెంబర్‌ నాటికి కూడా పనులు పూర్తవ్వకపోగా ఆతర్వాత 2019అన్నారు. ఈలోపు ఎన్నికలు రావడం టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకివ చ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో మంత్రులు కాస్త బాగానే హడావిడి చేశారు. చంద్రబాబు చేయలేకపోయిన పని ని తాము చేసి చూపిస్తామన్నారు. కానీ ఇంతవరూ ఫ్లైఓవర్ మాత్రం పూర్తికాలేదు.. . ఇక తిరుపతి గరడవారధి ఫ్లైఓవర్..ఇదీ దుర్గగుడి ఫ్లైఓవర్ పరిస్థితే.. దుర్గగుడి ఫ్లైఓవర్ మాదిరిగానే అడుగడుగునా ఆటంకాలే..రూ.684 కోట్ల బడ్జెట్‌, 6 కి.మీ పొడవు, 18 నెలలు గడువు.. స్థూలంగా ఇదీ ఒకప్పటి గరుడ వారధి పరిస్థితి. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. బడ్జెట్‌ వస్తుందో రాదో తెలియదు. కి.మీ దూరమైనా పూర్తవుతుందో లేదో అంతుపట్టడంలేదు. అనుకున్న బడ్జెట్‌ చేతికొచ్చినా ఎన్ని సంవత్సరాల్లో పూర్తవుతుందో స్పష్టత రావడంలేదు. ఇదీ ఇప్పటి పరిస్థితి. వారధికి అడుగడునా వస్తున్న అడ్డంకులు చూస్తున్న ప్రజలు అసహనం వ్యక్తంచేస్తున్నారు. తిరుమలకు సుమారు లక్ష మంది భక్తులు నిత్యం వస్తున్నారు. వీరంతా వాహనాల్లోనే తిరుపతి నుంచి తిరుమలకు వెళుతున్నారు. బస్సులు, కార్లు, ట్యాక్సీలు, జీపులు కలిపి రోజుకు సగటున 10వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో తిరుపతికి ఫ్లైఓవర్‌ అవసరమని దశాబ్దం కిందటే ప్రణాళికలు సిద్ధం చేశారు. వందల కోట్లతో పనికాబట్టి ముందడుగు వేయడానికి సాహసించలేదు. గత ఏడాది తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌గా వచ్చిన విజయ్‌రామరాజు తన డ్రీమ్‌ ప్రాజెక్టుగా ఫ్లైఓవర్‌ను ఎంచుకున్నారు. తిరుచానూరు మార్కెట్‌ యార్డు నుంచి కపిలతీర్థం వరకు ఆరు కి.మీ మేర ఫ్లైఓవర్‌ నిర్మించడానికి గత ఏడాది తిరుపతి స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌, టీటీడీ సంయుక్తంగా ఒప్పందానికి వచ్చాయి. రూ.684 కోట్ల వ్యయం అంచనాతో ‘ఎలివేటెడ్‌ స్మార్ట్‌ కారిడార్‌’ పేరిట గరుడ వారధి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. టీటీడీ రూ.458.28 కోట్లు కాగా.. స్మార్ట్‌ సిటీ నుంచి రూ225.72 కోట్లు భరించాలని నిర్ణయించారు. ప్రారంభంలో చిన్నచిన్న అవాంతరాలు ఎదురైనా గరుడ వారధిని నిర్మించి తీరుతానని అప్పటి కమిషనర్‌ విజయ్‌రామరాజు గట్టిగా నిలబడ్డారు. ఆదిశగా అందరితో సమన్వయం చేసుకుకుని ముందుకెళ్లారు. ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తామని ఆయన తరచూ చెప్పేవారు. తిరుపతి ప్రజలకు ఇది ఎంతో అవసరమని అంటుండేవారు. ఈక్రమంలోనే గత టీడీపీ ప్రభుత్వాన్ని ఒప్పించి టెండర్లు పిలిచారు. అలా అడుగు పడి వేగంగా పనులు జరుగుతున్న సమయంలోనే ప్రభుత్వం మారడం…కొత్త ప్రభుత్వం రివర్స్ టెండర్ల పేరుతో ఫ్లైఓవర్ పనులు నిలిపివేసింది. ఆతర్వాత డిజైన్లు ఫైనల్ కాలేదంటూ కొంతకాలం ఫ్లైఓవర్ పనులు నిలిచిపోయాయి.. ఆ తర్వాత ఫ్లైఓవర్ నిర్మాణానికి టీటీడీ నిధులు ఎందుకివ్వాలని ఫ్లైఓవర్లు నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదంటూ కొంతమంది కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కారణాలతో ఇప్పటివరకూ ఫ్లైఓవర్ టీటీడీ నిధులు ఇవ్వలేదు.. తాజాగా నిధుల సమస్యతో మరోసారి ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. తాజాగా టీటీడీ ఛైర్మన్ వైవీసుబ్బారెడ్డి ..ఫ్లైఓవర్ పనులు నిలిపివేయారని సూచించారు. టీటీడీ ఇవ్వాల్సిన నిధుల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదని స్వయంగా మున్సిపల్ కమిషనర్ కూడా చెబుతున్నారు. రెండు ఫ్లైఓవర్లు దేవుళ్ల సన్నిధిలో ఉన్నవే..రెండు ఫ్లైఓవర్లకు ఒకేరకమైన ఇబ్బందులు.. అడుగడుగునా ఆటంకాలు..పూర్తి చేయలేనప్పుడు ఇలాంటివి ఎందుకు మొదలుపెడతారంటూ ఇటు జనాలు మండిపడుతున్నారు. రాజకీయాలు పక్కన బెట్టి ఫ్లైఓవర్లను తొందరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రెండు ఫ్లైఓర్లు శంఖుస్థాపన చేసుకున్న తర్వాత మొదలైన మిగిలిన ఫ్లైఓవర్లు ఎప్పుడో పూర్తయిపోయాయి..కానీ ఈరెండు మాత్రం ఆగిపోయాయి..ఇదే విచిత్రం..ఇదే విడ్డూరం..అందుకే ఈ రెండింటినీ శాపగ్రస్థ ఫ్లైఓవర్లు అంటున్నారు.

అశోక్ వేములపల్లి, రాయలసీమ బ్యూరో చీఫ్, టీవీ9

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో