సోమవారం నుంచే స్కూల్స్.. పేరెంట్స్‌కు విద్యాసంస్థల మెసేజ్‌లు!

టీఎస్ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పాఠశాలలకు, విద్యాసంస్థలకు దసరా సెలవులను ఈ నెల 19 వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఈ ఉత్తర్వులను కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు పట్టించుకోవడం లేదని బాలల హక్కుల కమీషన్ పేర్కొంది. సోమవారం నుంచే పాఠశాలలకు రావాలంటూ తల్లిదండ్రులకు ఎస్ఎం‌ఎస్‌లు పంపుతున్నారని.. అంతేకాక లెక్చరర్స్‌ను కూడా విధులకు హాజరు కావాలని లేదంటే జీతంలో కోత పెడతామని బెదిరిస్తున్నారని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు […]

సోమవారం నుంచే స్కూల్స్.. పేరెంట్స్‌కు విద్యాసంస్థల మెసేజ్‌లు!
Follow us

| Edited By:

Updated on: Oct 14, 2019 | 12:16 PM

టీఎస్ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పాఠశాలలకు, విద్యాసంస్థలకు దసరా సెలవులను ఈ నెల 19 వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఈ ఉత్తర్వులను కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు పట్టించుకోవడం లేదని బాలల హక్కుల కమీషన్ పేర్కొంది. సోమవారం నుంచే పాఠశాలలకు రావాలంటూ తల్లిదండ్రులకు ఎస్ఎం‌ఎస్‌లు పంపుతున్నారని.. అంతేకాక లెక్చరర్స్‌ను కూడా విధులకు హాజరు కావాలని లేదంటే జీతంలో కోత పెడతామని బెదిరిస్తున్నారని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలు చెప్పింది వినాలా.. లేక ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించాలా అనే సందిగ్దతలో విద్యార్థులు ఉన్నారు. దసరా సెలవులపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ చేశారు.

Latest Articles