టాప్ 10 న్యూస్ @ 6PM

టాప్ 10 న్యూస్ @ 6PM

1. ఏపీలో సెప్టెంబరు 5 నుంచి కొత్త ఇసుక పాలసీ! సెప్టెంబరు 5 నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వస్తుందని సీఎం జగన్ వెల్లడించారు. మార్కెట్‌లో ఉన్న రేటు కంటే తక్కువరేటుకే ఇసుక అందుబాటులోకి తేవాలని అధికారులకు ఆయన సూచించారు. ఇసుక సరఫరా పెంచాలని.. Read more 2. రాజధానిపై తేల్చండి.. సీఎం కాన్వాయ్‌ వద్ద రైతుల నిరసన ఏపీ రాజధాని  అమరావతిని మార్చబోతున్నారన్న వార్తలతో ఆ ప్రాంత  రైతుల్లో ఆందోళన మొదలయ్యింది. ఈ క్రమంలో […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 27, 2019 | 6:00 PM

1. ఏపీలో సెప్టెంబరు 5 నుంచి కొత్త ఇసుక పాలసీ!

సెప్టెంబరు 5 నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వస్తుందని సీఎం జగన్ వెల్లడించారు. మార్కెట్‌లో ఉన్న రేటు కంటే తక్కువరేటుకే ఇసుక అందుబాటులోకి తేవాలని అధికారులకు ఆయన సూచించారు. ఇసుక సరఫరా పెంచాలని.. Read more

2. రాజధానిపై తేల్చండి.. సీఎం కాన్వాయ్‌ వద్ద రైతుల నిరసన

ఏపీ రాజధాని  అమరావతిని మార్చబోతున్నారన్న వార్తలతో ఆ ప్రాంత  రైతుల్లో ఆందోళన మొదలయ్యింది. ఈ క్రమంలో గత రెండు రోజులుగా రైతులు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.  తాజాగా రాజధాని.. Read more

3. గణేష్ మండపాల వద్ద సీసీ కెమెరాల నిఘా తప్పనిసరి : సీపీ

సెప్టెంబర్ 2న జరగనున్న గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు నగరంలో చురుకుగా సాగుతున్నాయి. వినాయక ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి .. Read more

4. సుబ్బిరామిరెడ్డి బంధువుల ఇంట్లో భారీ చోరీ..

హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి బంధువుల ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుబ్బిరామిరెడ్డి అన్న కొడుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో గత అర్థరాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు.. Read more

 5. కన్నబిడ్డను బస్సు కింద తోసేసిన కసాయి తల్లి..

కంటికి రెప్పలా కన్న బిడ్డను కాపాడాల్సిన తల్లి కసాయిగా మారింది. హైదరాబాద్ కూకట్ పల్లిలో జరిగిన సంఘటన.. అక్కడ ఉన్న ప్రజల్ని షాక్‌కు గురిచేసింది. భాగ్యనగర్ కాలనీలో నివసిస్తున్న ఓ మహిళ తన కన్న కూతురిని.. Read more

6. క్యూనెట్ కేసులో సినీ హీరోలకు నోటీసులు

క్యూనెట్  వ్యవహరంలో 38 కేసులు నమోదు చేసి 70 మందిని అరెస్ట్ చేసినట్టుగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. క్యూనెట్ కేసు వివరాలను సజ్జనార్ మీడియాకు వివరించారు.  మంగళశారం నాడు ఆయన హైద్రాబాద్ ‌లో.. Read more

7. ఏ ఒక్క చిన్న ఆధారమైనా చూపండి.. ప్రభుత్వానికి చిద్దూ కుటుంబ సవాల్

మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరంపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి నిరూపించే ఏ ఒక్క చిన్న ఆధారాన్నయినా చూపాలని ఆయన కుటుంబం ప్రభుత్వాన్ని సవాల్ చేసింది. ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో ఆయనను సీబీఐ.. Read more

8. కేంద్రానికి ఆర్బీఐ నగదు బదిలీ.. దూసుకెళ్లిన బుల్

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా లాభాల్లో ముగిశాయి. ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో తెచ్చిన సంస్కరణల నేపథ్యంలో సోమవారం ఉరకేలేసిన బుల్.. మంగళవారం కూడా అదే జోరుతో పరుగెత్తింది. దీనికి తోడు ఆర్బీఐ కేంద్రానికి.. Read more

9. ఫిరోజ్ షా కోట్లా.. ఇక అరుణ్ జైట్లీ స్టేడియం

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్డేడియం పేరు ఇక మారనుంది. కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత అరుణ్ జైట్లీ స్మారకార్థం కోట్లా స్టేడియానికి ఆయన పేరుపెట్టాలని ఢిల్లీ క్రికెట్ సంఘం నిర్ణయించింది. గతంలో జైట్లీ ఢిల్లీ క్రికెట్ సంఘానికి .. Read more

10. భారతీయురాలిగా గర్విస్తున్నా.. పీవీ సింధు

భారత స్టార్ షట్లర్, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివీ సింధు.. ప్రధాని మోదీని కలిశారు. బ్యాడ్మింటన్ ఛాంపియన్‌గా తన ఆనందాన్ని మోదీతో పంచుకున్నారు. తరువాత కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజుతోనూ ఆమె సమావేశం.. Read more

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu