ఏ ఒక్క చిన్న ఆధారమైనా చూపండి.. ప్రభుత్వానికి చిద్దూ కుటుంబ సవాల్

మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరంపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి నిరూపించే ఏ ఒక్క చిన్న ఆధారాన్నయినా చూపాలని ఆయన కుటుంబం ప్రభుత్వాన్ని సవాల్ చేసింది. ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో ఆయనను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ముందస్తు బెయిలుకోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే ఈ నేపథ్యంలో ఆయన కుటుంబం మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేస్తూ.. చిదంబరం సుమారు యాభై ఏళ్లుగా ప్రజా జీవనంలో ఉన్నారని, […]

ఏ ఒక్క చిన్న ఆధారమైనా చూపండి.. ప్రభుత్వానికి చిద్దూ కుటుంబ సవాల్
Follow us

|

Updated on: Aug 27, 2019 | 4:40 PM

మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరంపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి నిరూపించే ఏ ఒక్క చిన్న ఆధారాన్నయినా చూపాలని ఆయన కుటుంబం ప్రభుత్వాన్ని సవాల్ చేసింది. ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో ఆయనను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ముందస్తు బెయిలుకోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే ఈ నేపథ్యంలో ఆయన కుటుంబం మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేస్తూ.. చిదంబరం సుమారు యాభై ఏళ్లుగా ప్రజా జీవనంలో ఉన్నారని, అలాంటి వ్యక్తి ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. ఇండియాలోనూ, విదేశాల్లోనూ తనకు ఉన్న ఆస్తుల గురించి ఆయన ఏ విషయాన్నీ దాచలేదని, అటు మీడియా కూడా ప్రభుత్వానికి సహకరించేలా, తమ ‘ పబ్బం ‘ గడుపుకునేలా వ్యవహరిస్తోందని చిద్దూ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఒకవేళ ఏదైనా అవకతవకలు జరిగినట్టు నిరూపితమైతేనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది తప్ప..నిరాధారమైన ఆరోపణలతో ఒక వ్యక్తిని దోషిగా ఎలా పరిగణిస్తారని వారు ప్రశ్నించారు. సీబీఐ గురించి నేరుగా ప్రస్తావించకుండా చిదంబరం ఫ్యామిలీ ఈ ప్రకటన విడుదల చేసింది.