కన్నబిడ్డను బస్సు కింద తోసేసిన కసాయి తల్లి..

కంటికి రెప్పలా కన్న బిడ్డను కాపాడాల్సిన తల్లి కసాయిగా మారింది. హైదరాబాద్ కూకట్ పల్లిలో జరిగిన సంఘటన.. అక్కడ ఉన్న ప్రజల్ని షాక్‌కు గురిచేసింది. భాగ్యనగర్ కాలనీలో నివసిస్తున్న ఓ మహిళ తన కన్న కూతురిని బస్సు కింద విసిరేసింది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. వేగంగా వస్తున్న బస్సు కింద చిన్నారిని విసరడంతో ఆ చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆ కసాయి తల్లిని పట్టుకుని […]

కన్నబిడ్డను బస్సు కింద తోసేసిన కసాయి తల్లి..
Follow us

| Edited By:

Updated on: Aug 27, 2019 | 5:34 PM

కంటికి రెప్పలా కన్న బిడ్డను కాపాడాల్సిన తల్లి కసాయిగా మారింది. హైదరాబాద్ కూకట్ పల్లిలో జరిగిన సంఘటన.. అక్కడ ఉన్న ప్రజల్ని షాక్‌కు గురిచేసింది. భాగ్యనగర్ కాలనీలో నివసిస్తున్న ఓ మహిళ తన కన్న కూతురిని బస్సు కింద విసిరేసింది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. వేగంగా వస్తున్న బస్సు కింద చిన్నారిని విసరడంతో ఆ చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆ కసాయి తల్లిని పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Latest Articles