చుక్కలనంటిన టమాట ధరలు, కేజీ ఎంతంటే ?
దేశంలో టమాట రేట్లు మండిపోతున్నాయి. భారీ వర్షాలు, వరదలు కారణంగా పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల్లో పంటలు నీటమునిగాయి.
దేశంలో టమాట రేట్లు మండిపోతున్నాయి. భారీ వర్షాలు, వరదలు కారణంగా పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల్లో పంటలు నీటమునిగాయి. మరికొన్ని చోట్ల పంట సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దీంతో సామాన్యులకు అందనంటుంది టమాట. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లలో ధరలు షాక్ కు గురిచేస్తున్నాయి. మిజోరం, మణిపుర్ సహా పశ్చిమ్ బెంగాల్ లోని పలు ప్రాంతాలలో టమాట ధరలు కిలోకు రూ.100కి చేరుకున్నాయి.
ఈ మేరకు టమాట, ఆలూ, ఉల్లి సహా 22 నిత్యావసర సరకుల ధరలపై వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలు రిలీజ్ చేసింది. ఈ లెక్కల ప్రకారం దేశంలో టమాట సగటు ధర కిలోకు రూ.50గా ఉంది. ఆలూ, ఉల్లి సగటు రేట్లు కేజీకి రూ.35గా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ వివరించింది. వీటి గరిష్ఠ ధర రూ. 60గా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో టమాట ధరలు వరుసగా రూ.63, రూ.68, రూ.80, రూ.50గా ఉన్నాయి. అయితే లోకల్ వ్యాపారలు మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన రేట్లను లైట్ తీసుకుంటూ, అధిక రేట్లకు విక్రయాలు జరుపుతున్నారు.
Also Read :