Viral Photo: మాస్టారు.. గుర్రం ఎటువైపు తిరుగుతుందో చెప్పగలరా..? క్రేజీ టాస్క్ గురూ..!

ఇంటర్నెట్‌లో ఇప్పుడు ఆసక్తికరమైన పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్స్‌ వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య వీటి ట్రెండ్ బాగా పెరిగింది. ఇవి మనలోని సామర్థ్యాలను వెలికి తీస్తాయి.

Viral Photo: మాస్టారు.. గుర్రం ఎటువైపు తిరుగుతుందో చెప్పగలరా..? క్రేజీ టాస్క్ గురూ..!
Optical Illusion

Edited By:

Updated on: Mar 23, 2022 | 2:39 PM

Trending Photo:ఇంటర్నెట్‌లో ఇప్పుడు ఆసక్తికరమైన పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్స్‌ వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య వీటి ట్రెండ్ బాగా పెరిగింది. ఇవి మనలోని సామర్థ్యాలను వెలికి తీస్తాయి. ఆప్టికల్ ఇల్యూషన్స్‌‌లో మీకు మొదట కనిపించే దాన్ని బట్టి.. మీకు వ్యక్తిక్తం కనిపెట్టవచ్చు అంటున్నారు సైంటిస్టులు. ప్రఖ్యాత హ్యారీ పాటర్ రచయిత్రి JK రౌలింగ్ కూడా మార్చి 19న షేర్ చేసిన ఆప్టికల్ ఇల్యూజన్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. అది అలా ఉండగానే ప్రజంట్ ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటో నెటిజన్లతో ఓ ఆట ఆడుకుంటుంది. ఇది మిమ్మల్ని ఖచ్చితంగా కన్‌ఫ్యూజ్ చేస్తుంది. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోను సాల్వ్ చేయాలంటే.. మీ మెదడుకు పని చెబితే సరిపోదు.. మీ కళ్లకు కూడా పదునుండాలి. వైరల్ ఆప్టికల్ ఇల్యూషన్ యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. అందులో గుర్రం ఏ దిశలో తిరుగుతుంది అనేది మీరు కనిపెట్టాలి. వీడియోలో, గుర్రం దాని దిశను మార్చడాన్ని చూడవచ్చు.  “ఈ గుర్రం ఏ వైపు తిరుగుతోంది? ఎడమ లేదా కుడి?”  అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. ఇంటర్నెట్‌లో దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. దాని కాళ్ళు చూడండి మీకు ఆన్సర్ దొరుకుతుందని ఓ యూజర్ రాసుకొచ్చాడు. అది రెండు వైపులా కదులుతున్నట్లు కనిపిస్తోంది అని మరొక యూజర్ పేర్కొన్నాడు. మీరు ఏమనుకుంటున్నారు? దిగువ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలను సాల్వ్ చేయడంలో మస్త్ కిక్  వస్తుంది.  సవాళ్లు ఎదుర్కునే వాళ్లు అయితే.. వీటిని తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పడుతుంటారు.

 

Also Read:

Loading...
Unable to load recommendations.
Follow Us