టీనేజర్ల న్యూడ్​ సెల్ఫీల ఆటకట్టు..పేరెంట్స్‌కు సమాచారం

|

Feb 24, 2020 | 3:24 PM

మీరు సోషల్ మీడియాని యూజ్ చేస్తుంటే “న్యూడ్ పిక్స్ పంపు” అనే పదం గురించి తెలిసే ఉండొచ్చు. టీనేజ్ యూత్ వారి భాగస్వాములకు పంపిన నగ్న సెల్ఫీలు పెరగడం వల్ల ఈ పదం ప్రాచుర్యం పొందింది. అవగాహన లేని ఇటువంటి పనులు వల్ల యువత చిక్కుల్లో పడుతోంది.

టీనేజర్ల న్యూడ్​ సెల్ఫీల ఆటకట్టు..పేరెంట్స్‌కు సమాచారం
Follow us on

మీరు సోషల్ మీడియాని యూజ్ చేస్తుంటే “న్యూడ్ పిక్స్ పంపు” అనే పదం గురించి తెలిసే ఉండొచ్చు. టీనేజ్ యూత్ వారి భాగస్వాములకు పంపిన నగ్న సెల్ఫీలు పెరగడం వల్ల ఈ పదం ప్రాచుర్యం పొందింది. అవగాహన లేని ఇటువంటి పనులు వల్ల యువత చిక్కుల్లో పడుతోంది. ఆ ఫోన్ పోయినప్పుడు లేదా తస్కరణకు గురైనప్పుడు అందులోని ఫోటోలు ఇంటర్నెట్‌‌లో సర్కులేట్ అవ్వడం పరిపాటిగా మారింది. హత్యలు, ఆత్మహత్యలు వంటి వాటికి ఈ న్యూడ్ ఫోటోలు దారితీస్తున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు అదిరిపోయే ఆప్షన్‌తో స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది జపనీస్ కంపెనీ. ‘టోన్ ఇ 20’ అనేది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ టీనేజర్లను న్యూడ్ సెల్ఫీ తీసుకోకుండా నిరోధిస్తుంది.

స్మార్ట్​ఫోన్​ ప్రొటెక్షన్​ అనే స్పెషల్ ఫీచర్​తో వస్తోన్న ఈ ఫోన్​ అసభ్యకరమైన ఫొటోలు ఉంటే గుర్తిస్తుంది. ఈ ఫోన్ వినియోగించే టినేజర్లు తమవి లేదా ఇతరుల న్యూడ్  ఫొటోలను తీయకుండా నియంత్రిస్తుంది. ఈ ఫోన్‌లో ‘టోన్​ కెమెరా’ డిఫాల్ట్​గా వస్తుంది. అసభ్యకరమైన ఫోటోలు తీస్తుండగానే వాటిని నిరోధించి.. ఫోన్​లో సేవ్​ కాకుండా డిలీట్​ చేస్తుంది. AIతో మెషీన్ లెర్నింగ్‌ వల్ల ఇది సాధ్యమవుతుంది. అంతేకాదు.. ఈ ఫోన్ యూజ్ చేస్తోన్న టీనేజర్ల పేరెంట్స్ ఫోన్​కు అనుసంధానమై ఉంటుంది. న్యూడ్​ ఫొటోలు క్లిక్ చేసిన వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం చేరవేస్తోంది. టీనేజర్ల యొక్క భద్రతను కాపాడానికి టోన్ సంస్థ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. 6.2 అంగుళాల హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లే కలిగి ఉండే ఈ ఫోన్‌కి 4జీబీ ర్యామ్​-64జీబీ రామ్​ స్పేస్ ఉంటుంది.  మూడు వెనుక కెమెరాలు (12ఎంపీ+13ఎంపీ+2ఎంపీ) ఉంటాయి.  3,900 ఎంఏహెచ్​ బ్యాటరీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఫోన్ వెల  19,800 యెన్​లు (రూ.12,750).