
ఎప్పుడూ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉండే మంత్రి కేటీఆర్.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. అయితే నిత్యం రాజకీయ, సామాజిక అంశాలపైనే సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్లో పోస్టులు చేస్తుంటారు. అంతేకాదు.. తనకు ట్వీట్ చేసి.. సహాయం కోరితే.. ఆదుకున్న సంఘటనలు ఎన్నో. అయితే తాజాగా ఆదివారం కోన్ని ట్వీట్స్ చేశారు. అయితే ఈ సారి నిత్యం చేసే పోస్టులకు భిన్నంగా చేశారు. ఎప్పుడూ తన వ్యక్తిగతమైన పోస్టులు ఎక్కువగా పెట్టని ఆయన.. ఒక్కసారిగా ఆయన చిన్న నాటి ఫోటోస్లను ట్వీట్ చేశారు. బాల్యంలో తన సోదరి కవితతో పాటు.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు. అంతేకాదు.. తన తాతగారు జే. కేశవరావుతో దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. తన తాతయ్య స్వాతంత్ర్య సమరయోధుడని.. ఆ సమయంలో జైలుకు కూడా వెళ్లారని.. మా అందరికీ ఆయన ఎంతో గర్వకారణమని ట్వీట్లో పేర్కొన్నారు. అయితే ఈ ఫోటోలో కేటీఆర్‌ను చూసిన అభిమానులు.. హీరోలా ఉన్నావంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.