తెలంగాణలో కొత్తగా 2,216 మందికి కరోనా

రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం పెరుగుతున్న కేసులతో ఇటు అధికారుల్లోనూ, జనంలోనూ ఆందోళన కలుగుతోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,216 మందికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.

తెలంగాణలో కొత్తగా 2,216 మందికి కరోనా
Follow us

|

Updated on: Sep 13, 2020 | 9:37 AM

రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం పెరుగుతున్న కేసులతో ఇటు అధికారుల్లోనూ, జనంలోనూ ఆందోళన కలుగుతోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,216 మందికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,57,096కి చేరుకుంది. కాగా, 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి 11 మంది మృతి చెందగా, దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 961కి చేరింది. తాజాగా 2,603 మంది వైరస్‌ నుంచి కొలుకోగా, 1,24,528 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,607 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ చెప్పింది. కాగా, మరో 24,674 మంది హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది.

రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. దీంతో మరణాల రేటు 0.61శాతం ఉండగా, దేశంలో 1.65 శాతంగా ఉందని చెప్పింది. అలాగే, రికవరీ రేటు 79.2శాతంగా ఉందని, ఇది దేశ సగటు (77.84) కంటే ఎక్కువని పేర్కొంది. ఇక, శనివారం రాష్ట్రవ్యాప్తంగా 56,217 శాంపిల్స్‌ పరీక్షించగా, ఇక, ఇప్పటికీ 21,34,912 నమూనాలను పరిశీలించినట్లు తెలిపింది. ఇంకా 2,345 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని, పది లక్షల జనాభాకు 57,504 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 341 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 210, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 148, నల్గొండ జిల్లాలో 126, కరీంనగర్‌ జిల్లా 119, ఖమ్మం జిల్లా 105, వరంగల్‌ అర్బన్‌ జిల్లా 102 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరించింది.

Latest Articles