టెక్నాలజీ వర్సెస్ హెల్త్ కేర్.. మారుతున్న ట్రెండ్

టెక్నాలజీ మన జీవితాలను మార్చివేస్తోంది . దీనిపై మనం ఆధార పడాల్సిన పరిస్థితి రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇదే సమయంలో హెల్త్ కేర్ (ఆరోగ్య పరిరక్షణ) గురించి కూడా చెప్పుకోవాలి. ఈ రంగంలో టెక్నాలజీ అంతర్భాగం కావడమే కాదు.. కొన్ని ముఖ్య అంశాలకు కూడా మూలబిందువవుతోంది. హెల్త్ కేర్ లో టచ్ (ముట్టుకోవడం) అన్నది కీ పాయింట్. ఒక డాక్టర్ తో టచ్ అంటే అది పవిత్రమైనది కూడా.. టచ్ లేనిదే హెల్త్ కేర్ ఇంటరాక్షన్ పూర్తి కాదు. […]

  • Updated On - 5:35 pm, Mon, 28 October 19 Edited By: Pardhasaradhi Peri
టెక్నాలజీ వర్సెస్ హెల్త్ కేర్.. మారుతున్న ట్రెండ్

టెక్నాలజీ మన జీవితాలను మార్చివేస్తోంది . దీనిపై మనం ఆధార పడాల్సిన పరిస్థితి రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇదే సమయంలో హెల్త్ కేర్ (ఆరోగ్య పరిరక్షణ) గురించి కూడా చెప్పుకోవాలి. ఈ రంగంలో టెక్నాలజీ అంతర్భాగం కావడమే కాదు.. కొన్ని ముఖ్య అంశాలకు కూడా మూలబిందువవుతోంది. హెల్త్ కేర్ లో టచ్ (ముట్టుకోవడం) అన్నది కీ పాయింట్. ఒక డాక్టర్ తో టచ్ అంటే అది పవిత్రమైనది కూడా.. టచ్ లేనిదే హెల్త్ కేర్ ఇంటరాక్షన్ పూర్తి కాదు. అలాంటిది దీని స్థానే టెక్నాలజీ వస్తోంది . అది టచ్ వర్సెస్ టెక్నాలజీ అన్న దానిపై చర్చకే దారి తీస్తోందంటే అతిశయోక్తి కాదు. హెల్త్ కేర్ డెలివరీ స్పెక్ట్రమ్ లో సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో రకాల పరిష్కారాలకు కేంద్ర బిందువవుతోంది.
డాక్టర్ను కన్సల్ట్ చేయడం నుంచీ పేషంట్ ఆపరేషన్, వ్యాధుల చికిత్స, నివారణ వంటి అనేక అంశాల్లో టెక్నాలజీ వహిస్తున్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. టెలికన్సల్టేషన్, టెలిరేడియాలజీ, టెలిపాథాలజీ, రిస్క్ అసెస్ మెంట్ టూల్స్, రోబోల వినియోగం.. ఇలాంటివన్నింటినీ ఈ సందర్భంగా చెప్పుకోవలసిందే. ఒక విధంగా రోగికి, డాక్టర్ కి మధ్య సంబంధం ఈ రోజుల్లో గాడి తప్పుతోంది.

గతంలో రోగుల కుటుంబాల్లో డాక్టర్లు కూడా వారి ఫ్యామిలీ మెంబర్స్ గానే ఉండేవారు. ఆ బంధం అంత గొప్పగా ఉండేది. కానీ నేడు ఈ బంధం గతి తప్పింది. టెక్నాలజీ అన్నది రిమోట్ హెల్త్ కేర్ కి కూడా దోహదపడుతున్న నేపథ్యంలో.. రోగికి, డాక్టర్ కి మధ్య బంధం లేకుండాపోతోంది. కానీ.. ఇక్కడే ఒక పాయింట్ కూడా చెప్పుకోవాలి. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు, హాస్పటల్లోని డాక్టర్లకు మధ్య ఇది ఓ వారధిలా మారిపోయింది. ‘ ప్రిడిక్టివ్ ‘, ‘ ప్రివెంటివ్ ‘,’ పర్సనలైజ్డ్ ‘, ‘ ప్రిసిషన్ ‘ అన్న పదాల గురించి ఇక్కడ ప్రస్తావించుకోక తప్పదు. ఈ నాలుగు అంశాలూ ఎంతో ప్రాధాన్యం వహిస్తున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సలో వీటిని పరిగణన లోకి తీసుకోవలసిందే. వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు రకాల క్యాన్సర్లు సోకుతున్నాయి. అలాంటిది ఈ రోజుల్లో జెనెటిక్ కారణాలు కూడా ముఖ్యమైనవని నా అభిప్రాయం. జెనెటిక్స్ ని ఉపయోగించుకుని మనం అది ఏ రకమైన క్యాన్సరో డయాగ్నైజ్ చేయగలుగుతున్నాం.

ఈ నాలుగూ హెల్త్ కేర్లో ‘ పీ ఫార్మాట్ ‘ అంటే అత్యంత ప్రధానమైనవిగా మారాయి. క్యాన్సర్ చికిత్సా విధానాలు ఎంతగానో మెరుగుపడుతున్నాయంటే ఈ నాలుగు అంశాలే కీలకం,. ఇది నిరూపితమైంది కూడా.. ఇక రోగుల చికిత్సలో రోబోల వినియోగం.. ముఖ్యంగా శస్త్రచికిత్సల సందర్భంలో పెరుగుతోంది. రోబోటిక్ సర్జరీ ఖఛ్చితంగా జరుగుతోంది. ఇది సురక్షితం కూడా. రోగి శరీరంలో తాను డయాగ్నైజ్ చేయలేని భాగాలను కూడా రోబో సాయంతో సర్జన్ గుర్తు పట్టగలడు. అంటే ఇక్కడ టెక్నాలజీకి, హెల్త్ కేర్ కి మధ్య ఉన్న లింక్ స్పష్టమవుతోంది. ఒక విధంగా ఈ రోజుల్లో టచ్ అన్నది క్రిటికల్ మారుతున్నదని కూడా చెప్పవచ్చు. టెక్నాలజీ..హెల్త్ కేర్.అందుకే టెక్నాలజీని ఎంత బాగా ఎడాప్ట్ చేసుకుంటే అంత మంచిదన్నది నా భావన.

Disclaimer:ఈ ఆర్టికల్ లోని అంశాలు రచయిత సొంత అభిప్రాయాలు .. వీటితో టీవీ 9 కి గానీ, టీవీ 9 వెబ్ సైట్ తో గానీ ఎలాంటి సంబంధం లేదని మనవి.