బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్

విజయవాడలో టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. జాతీయ రహదారి దిగ్భందానికి విపక్షాలు పిలుపు ఇవ్వడంతో నారా లోకేష్ చినకాకానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందుగానే లోకేష్‌ని అరెస్ట్ చేశారు. బెంజ్ సర్కిల్‌ సమీపంలో ఆయన్ని అరెస్ట్ చేసి యనమల కుదురు పీఎస్‌కి తరలించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ నేత నిమ్మల రామానాయుడును సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే లోకేష్ అరెస్ట్‌ని టీడీపీ […]

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్
Follow us

| Edited By:

Updated on: Jan 07, 2020 | 6:38 PM

విజయవాడలో టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. జాతీయ రహదారి దిగ్భందానికి విపక్షాలు పిలుపు ఇవ్వడంతో నారా లోకేష్ చినకాకానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందుగానే లోకేష్‌ని అరెస్ట్ చేశారు. బెంజ్ సర్కిల్‌ సమీపంలో ఆయన్ని అరెస్ట్ చేసి యనమల కుదురు పీఎస్‌కి తరలించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ నేత నిమ్మల రామానాయుడును సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే లోకేష్ అరెస్ట్‌ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో.. తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అమరావతిలో ఆందోళనలు మరింత ఉదృత రూపం దాల్చాయి. రాజధాని రైతులతోపాటుగా పలు పార్టీల నేతలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కూడా టీడీపీ భారీ ర్యాలీ నిర్వహించారు. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్‌లో మూడు ‘రాజధానులు వద్దు- అమరావతి ముద్దు’ అనే నినాదంతో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. స్థానిక కోటగుమ్మం సెంటర్‌ నుంచి డిలాక్స్‌ సెంటర్‌ వకు నిరసన ర్యాలీ కొనసాగింది. టీడీపీ, జనసేన న్యాయవాదులు, వివిధ రాజకీయ నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు.