ట్రైలర్ టాక్: డబ్బు దోచుకెళ్తారు.. కానీ విద్యను..

తమిళ స్టార్ హీరో ధనుష్, విలక్షణ దర్శకుడు వెట్రి మారన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం.. ‘అసురన్’. వి. క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ విషయానికి వస్తే.. యదార్ధ సంఘటనలు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ధనుష్ ఇందులో ద్విపాత్రాభినయం చేశాడు. రాజదేవన్, […]

ట్రైలర్ టాక్: డబ్బు దోచుకెళ్తారు.. కానీ విద్యను..
Ravi Kiran

|

Sep 09, 2019 | 12:13 AM

తమిళ స్టార్ హీరో ధనుష్, విలక్షణ దర్శకుడు వెట్రి మారన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం.. ‘అసురన్’. వి. క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ట్రైలర్ విషయానికి వస్తే.. యదార్ధ సంఘటనలు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ధనుష్ ఇందులో ద్విపాత్రాభినయం చేశాడు. రాజదేవన్, కాళీ అనే తండ్రీకొడుకులుగా అతడు కనిపిస్తాడు. మలయాళ నటి మంజు వారియర్ ధనుష్‌కు జోడిగా నటిస్తోంది. పూమణి రాసిన తమిళ నవల ‘వేక్కై’ ఆధారంగా.. రివెంజ్ డ్రామాగా అసురన్‌ను తెరకెక్కించారు. కొద్దిరోజుల క్రితం ధనుష్ ఓల్డ్ ఏజ్ గెటప్‌తో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తమిళ తంబీలను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

ఇక రీసెంట్‌గా రిలీజ్ చేసిన రెండు వివిధ లుక్స్‌ కూడా ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఒక పోస్టర్‌లో ధనుష్ యంగ్‌ లుక్‌లో కనిపించగా.. మరో పోస్టర్‌లో అతి క్రూరంగా, భయంకరంగా కనిపిస్తాడు. ఎప్పటిలానే ధనుష్ తన వైవిధ్యమైన నటనతో దుమ్ములేపాడని తెలుస్తోంది. ట్రైలర్‌లోని బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ‘పొలాలు ఉంటే లాక్కుంటారు.. డబ్బును దోచుకెళ్తారు.. అదే మన దగ్గర చదువుంటే.. అది వాళ్ళు ఎప్పటికి తీసుకెళ్లలేరని’ చివర్లో ధనుష్ చెప్పిన డైలాగు ఆలోచింపజేసేలా ఉంది. ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకునే విధంగా కట్ చేశారు.

అక్టోబర్ 4న అసురన్ విడుదల కానుంది. అభిరమి, ప్రకాష్ రాజ్, పశుపతి, యోగిబాబు, తలైవాసల్ విజయ్, బాలాజీ శక్తివేల్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇది వెట్రి మారన్, ధనుష్ కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో చిత్రం కాబట్టి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంతకముందు వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ‘పొల్లాదవన్’, ‘ఆడుకళం’, ‘వడ చెన్నై’ సినిమాలు వచ్చాయి. కాగా ధనుష్ ఇటీవల ‘మారి 2’ సినిమాతో మంచి హిట్ సాధించిన సంగతి తెలిసిందే.

 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu