
సుశాంత్ కేసులో.. లోగడ ఈ నటుడికి, అతని అప్పటి మేనేజర్ దిశా శాలియన్ మధ్య సాగిన వాట్సాప్ చాటింగ్ తాజాగా నెట్ లో వైరల్ అవుతోంది. వారి మృతికి రెండు నెలల ముందు జరిగిన సంభాషణ ఇది.. ఏప్రిల్ 2, అదే నెలలో 10 వతేదీ మధ్య వీరు పబ్ జీ డిజిటల్ ప్రచారంపైన, ఓ ఫుడ్ ఆయిల్ బ్రాండ్ ప్రమోషన్ పైన చర్చించారు. ఆయిల్ బ్రాండ్ ప్రమోషన్ కి సంబంధించి దిశ అతనికి వివరించిందని, 60 లక్షలు కోట్ చేస్తానని తెలిపిందని ఈ వాట్సాప్ చాటింగ్ ద్వారా తెలుస్తోంది. అలాగే ఆ ఆయిల్ బ్రాండ్ పేరేమిటో తెలుసుకోవాలని సుశాంత్ కోరాడని, ఆ తరువాత పబ్ జీ డిజిటల్ ప్రచారంకోసం దిశ ఏప్రిల్ 7 న సుశాంత్ ని కలిసిందని వెల్లడవుతోంది.
అలాగే కరోనా వైరస్ నేపథ్యంలో ఇంట్లోనే ఉండాలని, పబ్ జీ ఆడుకోవాలంటూ ఆ సంస్థ డిజిటల్ క్యాంపెయిన్ చేస్తోందని, మీకు వీడియో పంపుతున్నానని కూడా దిశ పేర్కొంది. మీకు ఆసక్తి ఉంటేస్క్రిప్ట్ కోసం వారిని సంప్రదిస్తానని కూడా ఆమె తెలిపింది. అయితే ఇదంతా జరిగిన రెండు నెలల తరువాత అయిదు రోజుల వ్యవధిలో వీరు సూసైడ్ కి పాల్పడ్డారు.