
Surya’s Soorari Pottru Movie: తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో సుధా కొంగర దర్శకత్వం వహించిన ‘సూరారైపోట్రు’ సినిమా అక్టోబర్ 30వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. రిటైర్డ్ ఆర్మీ మేజర్ జీఆర్ గోపినాథ్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. అపర్ణా బాలమురళి, మోహన్ బాబు, పరేష్ రావల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా సమ్మర్ 2020ని విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా అది కాస్తా వాయిదా పడింది.
ఇక ఈ చిత్రాన్ని సూర్య తన సొంత బ్యానర్ 2D ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై నిర్మించారు. కరోనా లాక్‌డౌన్‌తో సినిమా థియేటర్స్పై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో సూర్య తన సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అక్టోబర్ 30 నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. కాగా, సూర్య, జ్యోతిక సినిమాలను థియేటర్స్‌లో విడుదల చేయమని ఇప్పటికే తమిళనాడు థియేటర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే.
Also Read: #HBDMegatarChiranjeevi ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ రిలీజ్..