బాలీవుడ్ ప్రముఖ సినీనటుడు, గురుదాస్ పూర్ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచం చిగురుటాకులా వణికిపోతుంది. సామాన్యులదగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ఎవ్వరిని వదల్లేదు  ఈ మహమ్మారి. ఇప్పటికే పలువురు సినిమా తారలు, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ మహమ్మారి బారినపడి కోలుకున్నారు.

బాలీవుడ్ ప్రముఖ సినీనటుడు, గురుదాస్ పూర్ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ కరోనా పాజిటివ్

Updated on: Dec 02, 2020 | 7:24 AM

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం చిగురుటాకులా వణికిపోతుంది. సామాన్యులదగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ఎవ్వరిని వదల్లేదు ఈ మహమ్మారి. ఇప్పటికే పలువురు సినిమా తారలు, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ మహమ్మారి బారినపడి కోలుకున్నారు. కొందరు మృత్యువాత కూడా పడ్డారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ సినీనటుడు, గురుదాస్ పూర్ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ కొవిడ్ బారిన పడ్డారు. 64 ఏళ్ల సన్నీడియోల్ ముంబైలో భుజానికి శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకునేందుకు కుల్లూ జిల్లాలోని మనాలీ సమీపంలోని ఫాం హౌస్ లో ఉంటున్నారు. అయితే సన్నీడియోల్, అతని స్నేహితులు కుల్లూ జిల్లా నుంచి తిరిగి ముంబై వెళ్లాలనుకున్నారు. ఈ క్రమంలో కరోనా పరీక్షలు చేయించుకోగా సన్నీడియోల్ కు పాజిటివ్ అని తేలిందని హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్య కార్యదర్శి అమితాబ్ అవస్థీ తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us