టీమిండియాను రెచ్చగొట్టొద్దు…

|

Nov 06, 2020 | 11:17 PM

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీని రెచ్చగొట్టొద్దని ఆస్ట్రేలియా దిగ్గజం ‌స్టీవ్‌వా ఆసీస్‌ ఆటగాళ్లను హెచ్చరించారు. అనవసరంగా స్లెడ్జింగ్‌కు దిగితే అతడితో పాటు మిగతా ఆటగాళ్లకూ అదనపు ప్రేరణ...

టీమిండియాను రెచ్చగొట్టొద్దు...
Follow us on

Sledging is Not Going to Worry Virat Kohli : టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీని రెచ్చగొట్టొద్దని ఆస్ట్రేలియా దిగ్గజం ‌స్టీవ్‌వా ఆసీస్‌ ఆటగాళ్లను హెచ్చరించారు. అనవసరంగా స్లెడ్జింగ్‌కు దిగితే అతడితో పాటు మిగతా ఆటగాళ్లకూ అదనపు ప్రేరణ అందించినట్టే అవుతుందని సూచించారు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు విరాట్‌ ఎంతో పరిణతి సాధించాడని పేర్కొన్నారు.

స్లెడ్జింగ్‌ విరాట్‌ కోహ్లీని ఏమీ చేయదని. గొప్ప ఆటగాళ్ల ముందు అది పనిచేయదని అన్నారు. అందుకే వాళ్ల మానాన వాళ్లను వదిలేయడం మంచిదని వారికి హితవు పలికారు. అందుకే ఏమీ అనకపోవడం ఉత్తమం అని స్టీవ్‌ వా అన్నాడు. క్రితంసారి కోహ్లీసేన ఆసీస్‌లో పర్యటించినప్పుడు టిమ్‌పైన్‌ విరాట్‌ను రెచ్చగొట్టినప్పుడు ఏం జరిగిందో తెలిసిందే. అయితే నిషేధం కారణం ఈ సిరీస్‌లో స్టీవ్‌స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ ఆడలేదు.

యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌ ముగియగానే కోహ్లీసేన ఆస్ట్రేలియాకు బయల్దేరనుంది. వారం రోజులు క్వారంటైన్‌లో ఉంటూనే సాధన చేయనుంది. మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. నవంబర్‌ 27న తొలి వన్డే జరగనుంది. డిసెంబర్‌ 17న టెస్టు సిరీస్‌ ఆరంభం అవుతుంది.