‘నాపై గుడ్లు విసిరేందుకు ఎవరూ ఉండరు’..

|

Aug 24, 2020 | 8:43 PM

అప్పటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ స్మిత్.. ఇంగ్లాండ్ లో బ్యాటింగ్ చేయడం తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు. కరోనా కారణంగా ఈసారి తనపై గుడ్లు విసిరేందుకు, ప్రేరణ ఇవ్వడానికి ఎవరూ ఉండరని చమత్కరించాడు. 

నాపై గుడ్లు విసిరేందుకు ఎవరూ ఉండరు..
Follow us on

Steve Smith Comments: కరోనా వైరస్ అన్నింటిని మార్చేసింది. ఇప్పుడు జరుగుతున్న.. మున్ముందు జరగనున్న క్రికెట్ మ్యాచులు అన్ని కూడా ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహిస్తారు. కోవిడ్ వల్ల ‘బయో సెక్యూర్ బబుల్’ వాతావరణానికి ఆటగాళ్లు అలవాటుపడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ పరిస్థితులపై ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా మూడు వన్డేలు, టీ20లు ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్ళింది.

Also Read: బాలకృష్ణ గొప్ప మనసు.. కోవిడ్ ఆసుపత్రికి భారీ విరాళం..

బాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత స్టీవ్ స్మిత్ కు ఇంగ్లాండ్ అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. అయినా కూడా స్మిత్ అద్భుత ప్రదర్శనను కనబరిచి టెస్టుల్లో అగ్రస్థానం చేరుకున్నాడు. అప్పటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ స్మిత్.. ఇంగ్లాండ్ లో బ్యాటింగ్ చేయడం తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు. కరోనా కారణంగా ఈసారి తనపై గుడ్లు విసిరేందుకు, ప్రేరణ ఇవ్వడానికి ఎవరూ ఉండరని చమత్కరించాడు.

Also Read: ఢిల్లీ టూ లండన్.. బస్సులో అడ్వెంచర్ జర్నీ..