చట్టాలు, పోలీసులను గౌరవించాలి.. శ్వేత సౌధం ముందు ట్రంప్ మద్దతుదారుల భారీ ర్యాలీ

అమెరికా కాంగ్రెస్​ సంయుక్త సమావేశం సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీ చేపట్టిన మద్దతుదారులు శ్వేతసౌధం పోలీసులకు సహకరించారని కోరారు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. క్యాపిటోల్​ వద్ద పోలీసులతో..

  • Sanjay Kasula
  • Publish Date - 2:38 am, Thu, 7 January 21
చట్టాలు, పోలీసులను గౌరవించాలి.. శ్వేత సౌధం ముందు ట్రంప్ మద్దతుదారుల భారీ ర్యాలీ

US President : అమెరికా కాంగ్రెస్​ సంయుక్త సమావేశం సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీ చేపట్టిన మద్దతుదారులు శ్వేతసౌధం పోలీసులకు సహకరించారని కోరారు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. క్యాపిటోల్​ వద్ద పోలీసులతో ఘర్షణ వాతావరణ తలెత్తగా ఈ మేరకు ట్వీట్​ చేశారు.

‘క్యాపిటోల్​ పోలీసులు, అధికారులకు మద్దతు ఇవ్వండి. వారు నిజంగా మన దేశంవైపునే ఉన్నారు. శాంతి యుతంగా ఉండాలి. అమెరికా కాంగ్రెస్​ వద్ద ఉన్న ప్రతి ఒక్కరు శాంతియుతంగా ఉండాలని కోరుతున్నా. హింస వద్దు. మనమంతా శాంతిభద్రతలకు కట్టుబడి ఉన్నామని గుర్తుంచుకోవాలి. చట్టాలు, పోలీసులను గౌరవించాలి. ‘ అని పేర్కొన్నారు.