ఆ ఎమ్మెల్సీతో మాట్లాడితే భారీ జరిమానా..!

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామంలో విచిత్రం జరిగింది. స్థానిక ఎమ్మెల్సీతో నేరుగా మాట్లాడితే రూ.10వేలు.. ఫోన్లో మాట్లాడితే రూ.3వేల జరిమానా విధించాలని అక్కడి గ్రామస్తులు కట్టుబాటు విధించారు. తమ గ్రామాన్ని ఉద్దేశించి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. శివాలయ పునర్నిర్మాణంలో భాగంగా మంగళ, బుధ, గురువారాలు ప్రత్యేక కార్యక్రమాలను తలపెట్టారు గ్రామస్తులు. తొలిరోజు స్థానిక ఎమ్మెల్సీ బీద రవిచంద్ర హాజరయ్యారు. ఈ గ్రామం […]

ఆ ఎమ్మెల్సీతో మాట్లాడితే భారీ జరిమానా..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 12, 2020 | 3:02 PM

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామంలో విచిత్రం జరిగింది. స్థానిక ఎమ్మెల్సీతో నేరుగా మాట్లాడితే రూ.10వేలు.. ఫోన్లో మాట్లాడితే రూ.3వేల జరిమానా విధించాలని అక్కడి గ్రామస్తులు కట్టుబాటు విధించారు. తమ గ్రామాన్ని ఉద్దేశించి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. శివాలయ పునర్నిర్మాణంలో భాగంగా మంగళ, బుధ, గురువారాలు ప్రత్యేక కార్యక్రమాలను తలపెట్టారు గ్రామస్తులు. తొలిరోజు స్థానిక ఎమ్మెల్సీ బీద రవిచంద్ర హాజరయ్యారు. ఈ గ్రామం సమీపంలోని ఇస్కపల్లిపాలేనికి చెందిన మత్స్యకారులూ తరలివచ్చారు. ఇసకపల్లి గ్రామంలో కాశీ విస్వేశ్వర ఆలయ జీర్ణోదరణ, కుంబాభిషేకం సమయంలో వివాదం నెలకొంది.

ఆలయ పూజలకు సముద్ర జలాల కోసం వెళ్లిన సందర్భంలో వివాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ‘ఇలాంటి దరిద్రపు ఊరు జిల్లాలో లేదు’.. అంటూ రవిచంద్ర తన స్వగ్రామం ఇస్కపల్లిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాక.. మత్స్యకార మహిళల వద్ద మరోమారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో మహిళలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ‘మేం దరిద్రపు వాళ్లమా, 30 ఏళ్లుగా మా గ్రామాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు రాజకీయంగా రాష్ట్రస్థాయికి ఎదిగి, మమ్మల్ని దూషిస్తావా’.. అంటూ మండిపడ్డారు. కలశాల్లో సముద్రపు నీరు ఇవ్వబోమని, అక్కడ నుంచి వెళ్లిపోవాలని వారు హెచ్చరించారు. అనంతరం ఇస్కపల్లిపాలెంలో మత్స్యకారులంతా సమావేశమయ్యారు. బీద రవిచంద్రతో మాట్లాడితే రూ.10,000, ఫోన్‌లో మాట్లాడితే రూ.3,000 జరిమానా చెల్లించాలని మత్స్యకారులు కట్టుబాటు పెట్టుకున్నారు.

అయితే.. దీనిపై బీద రవిచంద్ర టీవీ9 తో మాట్లాడుతూ.. గ్రామంలో జరిగిన వాస్తవ పరిస్థితి వేరు..ప్రచారంలో ఉన్నది వేరు..గ్రామాన్ని ఇంత దరిద్రంగా ఉంచుకున్నారని మాత్రమే అన్నాను అని తెలిపారు. కేవలం గ్రామ పరిసర ప్రాంతాలు అశుభ్రంగా ఉండటంతో .. గ్రామ పెద్ద కాపుతో ఆలా అన్నానని అయన వివరించారు. ఆ వ్యాఖ్యలు గ్రామం గురించి కాదని, ప్రస్తుతం గ్రామంలో ని ఆలయంలో పూజల్లో ఉండటంతో ఇప్పుడు ఏమీ మాట్లాడలేనని, రెండు రోజుల్లో దీనిపై పూర్తి స్థాయిలో మాట్లాడుతానని బీద రవిచంద్ర స్పష్టంచేశారు.