నాసా.. స్పేస్ ఎక్స్ సంయుక్త కృషి.. రోదసిలోకి మానవ సహిత యానం

| Edited By: Pardhasaradhi Peri

May 31, 2020 | 4:13 PM

స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మాస్క్, నాసా కలిస్తే.. ఇక సాధించలేనిది ఏముంటుంది ? ప్రైవేటు వ్యోమనౌకలో మానవ సహిత అంతరిక్షయానం సుసాద్యమైంది. ఫ్లోరిడాలోని కేప్ కెనవరల్ లో గల కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి...

నాసా.. స్పేస్ ఎక్స్ సంయుక్త కృషి.. రోదసిలోకి మానవ సహిత యానం
Follow us on

స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మాస్క్, నాసా కలిస్తే.. ఇక సాధించలేనిది ఏముంటుంది ? ప్రైవేటు వ్యోమనౌకలో మానవ సహిత అంతరిక్షయానం సుసాద్యమైంది. ఫ్లోరిడాలోని కేప్ కెనవరల్ లో గల కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది. అమెరికా కాలమానం ప్రకారం.. శనివారం సాయంత్రం 3 గంటల 22 నిముషాలకు రాబర్ట్ బెహెంకన్, డో హార్లే అనే ఇద్దరు వ్యోమగాములతో కూడిన ఈ రాకెట్ ఎగసింది. తొమ్మిదేళ్ల తరువాత అమెరికన్ క్రూ యుఎస్ గడ్డపై లాంచ్ చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అయింది. రాకెట్ లాంచ్ కి ముందు కమాండర్ హార్లే.. ‘లెటజ్ లైట్ దిస్ క్యాండిల్’ అని వ్యాఖ్యానించాడు. 1961 లో అమెరికా తొలి మానవ సహిత ప్రయోగంలో నాటి యేస్ట్రోనట్ అలెన్ షెపర్డ్ అన్న మాటలే ఇవి !ఒక ప్రైవేటు కంపెనీ (స్పేస్ ఎక్స్) వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడం ఇదే తొలిసారి. గత బుధవారమే ఈ ప్రయోగం జరగవలసి ఉన్నా.. వాతావరణం బాగు లేకపోవడంతో శనివారం సాయంత్రానికి వాయిదా వేశారు.

కక్ష్యలోకి ఫాల్కన్-9  చేరిన తరువాత తిరిగి భూమికి చేరుకుంది. ఆ వెంటనే స్పేస్ ఎక్స్ కి చెందిన అటానమస్ స్పేస్ పోర్ట్ డ్రోన్ షిప్ నుంచి’ఐ స్టిల్ లవ్ యు’ అనే పదాలు వినిపించడం విశేషం.

క్రూ డ్రాగన్ అంతర్జాతీయ స్పేస్ స్టేషనుకు చేరుకోవడానికి 19 గంటలు పడుతుంది. అక్కడ ఇద్దరు వ్యోమగాములూ ఎక్స్ పెడిషన్ 63 క్రూ ని కలుస్తారు. వీరు నాలుగు నెలల పాటు అక్కడే గడుపుతారు. వ్యోమగామి రాబర్ట్ బెహేంకన్…  తన పిల్లల్లో ఒకరు ఆడుకునే డైనోసార్ బొమ్మను కూడా తనతో బాటు తీసుకువెళ్లడం ఆశ్చర్యకరం.

కాగా-యుఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఇద్దరూ.. ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి ఎగసిన దృశ్యాన్ని చాలా దూరం నుంచిచూడడం కొసమెరుపు.