DE Kock As captain : దక్షిణాఫ్రికా టెస్టు టీమ్ పగ్గాలు కూడా డి కాక్ చేతికి వచ్చేశాయి. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత దక్షిణాఫ్రికా వన్డే, టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి డుప్లెసిస్‌ని తప్పించిన సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు.. డికాక్‌ని కెప్టెన్‌ని చేసింది. తాజాగా శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కోసం టెస్టు జట్టుని ఎంపిక చేసిన దక్షిణాఫ్రికా సెలెక్టర్లు కెప్టెన్‌గా డి కాక్ పేరుని ప్రకటించారు. ఈ టీమ్‌లోకి డుప్లెసిస్ ఎంపికైనా.. అతను కేవలం బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే వ్యవహరించనున్నాడు.
శ్రీలంక జట్టుకు దక్షిణాఫ్రికా ఆథిత్యమిస్తోంది.. ఇందులో భాగంగా డిసెంబరు 20 నుంచి 22 వరకూ మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత డిసెంబరు 26 నుంచి 30 వరకూ సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు తొలి టెస్టులో ఢీకొననుండగా.. జనవరి 3 నుంచి 7 వరకూ జోహనెస్ బర్గ్‌లో రెండో టెస్టులో తలపడనున్నాయి. అయితే.. రబాడ, ప్రిటోరియస్ సెలక్షన్స్ సమయానికి ఫిట్నెస్ సాధించలేకపోడంతో ఫాస్ట్ బౌలర్ కగిసో ఈ సిరీస్‌కి ఎంపికవలేదు.