పోలీసు అకాడమీ డైరెక్టర్‌ వీకే సింగ్ రాజీనామా

సీనియర్‌ ఐపీఎస్ అధికారి వినోయ్‌కుమార్‌ సింగ్‌ తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శికి పంపారు.

పోలీసు అకాడమీ డైరెక్టర్‌ వీకే సింగ్ రాజీనామా

Updated on: Jun 24, 2020 | 11:05 PM

సీనియర్‌ ఐపీఎస్ అధికారి వినోయ్‌కుమార్‌ సింగ్‌ తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శికి పంపారు. గత కొంత కాలంగా తెలంగాణ ప్రభుత్వంపై తీరుపై వీకే సింగ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వీకే సింగ్‌.. గాంధీ జయంతి రోజున పదవీ విరమణ ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. తన సర్వీస్‌ పట్ల ప్రభుత్వం సంతృప్తిగా లేనట్టుందని వీకే సింగ్‌ అభిప్రాయపడ్డారు. తాను ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదన్న ఆయన.. సర్కార్ కు తాను భారం కాదల్చుకోలేకనే రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో స్పష్టంచేశారు. మరోవైపు ఈ ఏడాది నవంబర్‌ 30న వీకే సింగ్‌ సర్వీసు ముగియనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us